"డాకు మహారాజ్" ట్రైలర్ లో మీరు ఇది గమనించారా..బాబీ బిగ్ మిస్టేక్ చేసేసాడుపో..!

Thota Jaya Madhuri
ఈ సంక్రాంతి మోర్ మోర్ స్పెషల్ అంటున్నారు నందమూరి అభిమానులు . సాధారణంగా సంక్రాంతి అంటే పిండి వంటలు.. బంధువులతో పాటు  థియేటర్స్ లో కొత్త కొత్త సినిమాలు కూడా రిలీజ్ అవుతూ ఉంటాయి . ప్రతి సంవత్సరం సంక్రాంతి కానుకగా కొన్ని సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. మరీ ముఖ్యంగా బడా స్టార్స్ సంక్రాంతి రేసుల్లో ఎక్కువ నిలుస్తూ ఉంటారు . కాగా పోయిన సంక్రాంతికి మహేష్ బాబు నటించిన  "గుంటూరు కారం"  సినిమాతో తేజ హనుమాన్ సినిమాతో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేశారు . కాగా ఈ సంక్రాంతి సందర్భంగా థియేటర్స్ లో మెగాస్టార్ చిరంజీవి నటించిన "విశ్వంభర" అదేవిధంగా బాలయ్య నటించిన "డాకు మహారాజ్".. అదేవిధంగా వెంకటేష్ నటించిన "సంక్రాంతికి వస్తున్నాం".. సినిమాలు మూడు కూడా రిలీజ్ కాబోతున్నాయి.


బాబీ దర్శకత్వంలో బాలయ్య నటించిన తాజా సినిమా "డాకు మహారాజ్". ఈ మూవీ  టైటిల్ తోనే ఓ రేంజ్ లో ఇంప్రెషన్ పెంచేసాడు బాబి . కాగా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ చూస్తున్నంత సేపు గూస్ బంప్స్  పక్క అందులో నో డౌట్ . బాలయ్యను చాలా డిఫరెంట్ యాంగిల్ లో చూపించాడు బాబి అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు . సాధారణంగా బాలయ్య అంటే తొడ కొట్టడాలు ..మీసం మెలివేయడాలు.. కత్తులతో నరకడలు ..తొడకొట్టి ట్రైన్ ని ఆపడాలు ఇలాంటి సీన్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం .


అయితే బాలయ్యలో ఒక ఎమోషనల్ ఫెలో కూడా ఉన్నాడు అంటూ అనిల్ రావిపూడి "భగవంత్ కేసరి" సినిమాతో ప్రూవ్ చేశారు . అదేవిధంగా మరొకసారి బాబీ "డాకు మహారాజ్" సినిమాలో బాలయ్యను చూపించి అభిమానులకి కొత్త సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాడు . కాగా బాలయ్య అభిమానులకు ట్రైలర్ మొత్తం నచ్చేసింది . కానీ బాలయ్య అంటేనే మాస్ డైలాగ్స్ కి కేరాఫ్ అడ్రస్ . అయితే అలాంటి ఒక్క మాస్ డైలాగ్ కూడా బాలయ్య నోటి నుండి ఈ ట్రైలర్ లో వినిపించకపోవడం ఫాన్స్ కి కూసింత డిసప్పాయింట్ చేస్తుంది. సినిమాలో కచ్చితంగా మాస్ డైలాగ్స్ ఉంటాయి.  అందులో నో డౌట్ . అయితే ట్రైలర్ లో ఒకటో రెండో వదిలి ఉంటే మాత్రం ట్రైలర్ ఇంకా ఓ రేంజ్ లో దున్నేసి  ఉండేది అంటూ మాట్లాడుకుంటున్నారు అభిమానులు. బాబీ కావాలని సర్ప్రైజ్ కోసం ఆ డైలాగ్స్ దాచాడో లేకపోతే పొరపాటున ఎడిటింగ్ లో డైలాగ్స్ లేపేసారు..? ఏంటో తెలియదు కానీ బాబీ మాత్రం ఒక చిన్న మిస్టేక్ తో ఇప్పుడు బాలయ్య ఫ్యాన్స్ నిరాశ పడేలా చేసేసాడు అంటున్నారు జనాలు..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: