గేమ్‌ ఛేంజర్‌ కు టాలీవుడ్‌ విలన్‌ చిక్కులు?

Veldandi Saikiran
గ్లోబర్‌ స్టార్‌ రామ్ చరణ్ నటించిన తాజా చిత్రం "గేమ్ చేంజర్". ఈ సినిమా జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో గేమ్ చేంజర్ సినిమాను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నారు. గేమ్ చేంజర్ సినిమాకు స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించాడు. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్ గా నటించింది.

గేమ్ చేంజర్ సినిమాను శ్రీమతి అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, జి స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్ పై దిల్ రాజు, శిరీష్ కలిసి నిర్మించారు. కాగా, ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న సమయంలో గేమ్ చేంజర్ సినిమాకు చాలా సినిమాలు పోటీని ఇవ్వబోతున్నాయి. అయితే ఈ క్రమంలోనే తమిళనాడులో సంక్రాంతి రేసు నుంచి తప్పకుంటున్నట్లుగా తల అజిత్ చెప్పాడు.

నిజంగా ఈ విషయం తెలిసి గేమ్ చేంజర్ చిత్ర యూనిట్ సభ్యులు ఉత్సాహంలో ఉన్నారు. ఇలాంటి సమయంలో సోను సూద్ తాను నటిస్తూ దర్శకత్వం వహించిన "ఫతే" సినిమాను సంక్రాంతి పండుగ బరిలో రిలీజ్ చేస్తున్నామని అనౌన్స్ చేసి షాక్ ఇచ్చాడు. సోను సూద్ తెలుగు సినీ పరిశ్రమకు సుపరిచితుడు. రామ్ చరణ్, చిరంజీవి నటించిన అనేక సినిమాలలో విలన్ గా నటించాడు.

టాలీవుడ్ అగ్ర హీరోలు అందరి సినిమాలోనూ విలన్ పాత్రలో అద్భుతంగా నటించాడు. అలాగే బాలీవుడ్ లో కొన్ని క్రేజీ సినిమాలలో మంచి పేరు సంపాదించుకున్నాడు  అందువల్ల అతడు తన సినిమాని గేమ్ చేంజర్ సినిమాతో పోటీ పడుతూ రిలీజ్ చేస్తుండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే విలన్ పాత్రలు పోషించే సోను సూద్ మెగా హీరో రామ్ చరణ్ తో కలిసి పోటీ పడగలడా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది. మరి ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా అత్యంత భారీ కలెక్షన్లను రాబడుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: