లక్ష్మీ , నరసింహనాయుడు సినిమాలతో.. సంక్రాంతి బరిలో దుమ్మురేపిన స్టార్ ప్రొడ్యూసర్స్ వేరే..!

Amruth kumar
సంక్రాంతి వచ్చిందంటే చాలు కోడిపందాలు గాలి పటాలే కాదు సినిమాల హడావిడి కూడా గట్టిగా ఉంటుంది .. తెలుగు చిత్ర పరిశ్రమలో కొన్ని దశాబ్దాలుగా సంక్రాంతికి భారీ బడ్జెట్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి .. ఒకప్పటి ఎన్టీఆర్ , నాగేశ్వరరావు నుంచి ఇప్పటి మహేష్ , ఎన్టీఆర్ , రామ్ చరణ్ వరకు సంక్రాంతి పోటీలను నిలిచి విచేతులుగా నిలిచిన వారే .. ఇప్పుడు వచ్చే సంక్రాంతికి కూడా మూడు పెద్ద సినిమాలు ప్రేక్షకుల ముందుకు కోస్తున్నాయి .. ఇదే క్రమంలో ఇప్పటివరకు మన సంక్రాంతికి హీరోలతో పాటు నిర్మాతల కూడా సినిమాలతో పోటీపడ్డారు .. తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర నిర్మాతలు కూడా ఎక్కువగా సంక్రాంతికి సినిమాలు విడుదల చేయాలని ఎంతో ఆశపడుతూ ఉంటారు.

ఇదే క్రమంలో మన తెలుగు చిత్ర పరిశ్రమ లో 2001 లో బాలకృష్ణ హీరోగా బి.గోపాల్ దర్శకత్వంలో వచ్చిన నరసింహనాయుడు సినిమాను. శ్రీ వెంకటరమణ ప్రొడక్షన్స్ బ్యానర్ పై మేడికొండ మురళీకృష్ణ నిర్మించారు. ఈ సినిమా 2001 సంక్రాంతికి జనవరి 11న ప్రేక్షకు ముందుకు వచ్చి టాలీవుడ్ చరిత్రలోనే సంచలన విజయం అందుకుంది. అలాగే ఈ సినిమాతో నిర్మాత మేడికొండ మురళీకృష్ణ సంక్రాంతి నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు. నట‌సింహం బాలకృష్ణ  కూడా భారీ రికార్డులను తన ఖాతాలో వేసుకున్నారు. ఇప్పటికి న‌ర‌సింహ‌నాయ‌డు క్రియేట్ చేసిన కొన్ని రికార్డులు ఏ హీరో కూడా తిరగరాయలేకపోయారు.

అలాగే మరో స్టార్ హీరో వెంకటేష్ హీరోగా వచ్చినా లక్ష్మీ సినిమాని కూడా టాలీవుడ్ స్టార్ దర్శకుడు వివి వినాయక్ తెరకెక్కించారు .. ఫ్యామిలీ యాక్షన్ సినిమాగా వచ్చిన ఈ సినిమాను శ్రీ లక్ష్మీనరసింహ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నల్ల మలుపు బుజ్జి నిర్మించారు .. ఈ సినిమా కూడా ఆ రోజుల్లో సూపర్ హిట్గా నిలిచింది .. ఇలా నల్ల మలుపు బుజ్జి కూడా సంక్రాంతి నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు.  ఇప్పుడు ఈ 2025 లో కూడా మూడు బడా సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.. గేమ్ చేంజర్ , సంక్రాంతికి వస్తున్నాం , డాకు మహారాజ్.. అయితే ఈ మూడు సినిమాల్లో రెండు సినిమాలకు దిల్ రాజు నిర్మాత .. బాలయ్య సినిమాకు నాగ‌ వంశీ నిర్మాతగా ఉన్నారు. ఈ వచ్చే సంక్రాంతికి ఈ ఇద్దరి నిర్మాతల్లో ఎవరు సంక్రాంతికి విజేతగా నిలుస్తారు అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: