హీరోతో శ్రీలీల ప్రేమాయణం.. నిర్మాత అసలు విషయం చెప్పేసాడుగా?
మొదటి సినిమాతోనే ఆమె ఇక్కడ మంచి గుర్తింపు సాధించుకుంది. ఆ చిత్రం తర్వాత ఆమె వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఆ తరువాత ఆమె చేసిన ధమాకా చిత్రం భారీ బ్లాక్ బస్టర్ కావడంతో వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ గా నటించే అవకాశాలు దక్కించుకుంది. అయితే ఈ మధ్య ఆమెకి వరుసగా డిజాస్టర్ ఫ్లాప్స్ రావడంతో అవకాశాలు తగ్గిపోయాయని అనుకున్నారు. కానీ ఆమె తెలుగు సినిమాలకు గ్యాప్ ఇవ్వడానికి కారణం MBBS పరీక్షలు ఉండడం వల్లే అని పలు ఇంటర్వ్యూస్ లో చెప్పుకొచ్చింది. ఇదంతా పక్కన పెడితే శ్రీలీల ఒక ప్రముఖ బాలీవుడ్ యంగ్ హీరోతో ప్రేమాయణం నడుపుతుందని లేటెస్ట్ గా ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఆ హీరో మరెవరో కాదండోయ్... కార్తీక్ ఆర్యన్. అయితే ఆ ప్రేమ రియల్ లైఫ్ లో మాత్రం అనుకుంటే... మీరు పప్పులో కాలేసినట్టే! వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ త్వరలోనే తెరకెక్కనుంది అని ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ చెప్పుకొచ్చారు. ఆయనే స్వయంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడట. ఈ సందర్భంగా హీరో మాట్లాడుతూ ‘నేను ప్రేమలో 3 సార్లు విఫలం అయ్యాను. నాల్గవసారి మళ్లీ ప్రేమలో పడ్డాను, ఈసారి ఇంతకు ముందులాగ జరగకూడదని కోరుకుంటున్నాను!’ అంటూ ‘తు మేరీ మై తేరా..మై తేరా తు మేరీ’ అనే చిత్రాన్ని ప్రకటించాడు. ఈ చిత్రానికి సమీర్ విద్వాన్స్ దర్శకత్వం వహించడం విశేషం. ఇది శ్రీలీల కి మొట్టమొదటి బాలీవుడ్ చిత్రం కావడం గమనార్హం.