మహేష్‌బాబు - నానిలతో సినిమాలు.. ఇప్పుడు రాజకీయాల్లో బిజీ హీరోయిన్.. ఎవరో తెలుసా..!
పై ఫోటోలో ఉన్న అమ్మాయి ఎవరో ? గుర్తుపట్టారా .. ఈ అమ్మాయి ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్. కెరీర్ ప్రారంభంలోనే ఏకంగా మహేష్ బాబు - నాని లాంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. హీరోయిన్గా వరుసగా రెండు హిట్లు కూడా అందుకుంది. మంచి అందంతో పాటు ... చక్కని అభినయం ఉండడంతో తక్కువ టైంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత దురదృష్టం వెంటాడింది. చాలా సినిమాలు చేసిన విజయం దక్కలేదు. తెలుగు తో పాటు తమిళంలో సినిమాలు చేసిన సక్సెస్ మాత్రం రాలేదు. ఇక సినిమాలతో లాభం లేదు .. అనుకుని ఏకంగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేసింది. కాషాయ కండువా కప్పుకుని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూడా పోటీ చేసింది .. ఎమ్మెల్యేగా ఓడిపోయింది. ప్రస్తుతానికి సినిమాలకు దూరంగా ఉంటూ ఎప్పటికప్పుడు సంచలన కామెంట్స్ తో నిత్యం వార్తల్లో నిలుస్తోంది. రాజకీయాల పరంగానే కాకుండా సామాజిక అంశాలపై తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.
ఇటీవల ఏకంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచిన ఈ సొగసరి ముద్దుగుమ్మ మరెవరో కాదు మాధవి లత. ఇక పైన ఉన్నవి ఆమె టీనేజ్ నాటి ఫోటోలు .. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మాధవి లత తాజాగా ఒక పోస్ట్ షేర్ చేసింది .. తన కాలేజ్ ఐడి కార్డు అందులో షేర్ చేసింది. కర్ణాటకలోని బళ్లారిలో వుంకి సన్నరుద్రప్ప ( వీఎస్సార్ ) లా కాలేజీలో ఆమె చదువుతున్నప్పటి ఐడీ కార్డు అది. ఈ ఐడీ కార్డు ను మాధవీలత స్వయంగా సోషల్ మీడియాలో పంచుకుంది. తవ్వకాల్లో బయటపడిందంటూ ఆమె చమత్కారంతో పోస్ట్ పెట్టింది. బళ్లారిలోని వీఎస్సార్ కాలేజిలో ఎల్ఎల్ బీ చదివానని ... ఇలాంటివి చూస్తుంటే అబ్బో జీవితంలో మనం చాలా చేశాం అనిపిస్తుంటుందని మాధవీలత తన కామెంట్ లో పేర్కొంది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అవుతున్నాయి.