సాయి పల్లవికి ఆ హీరో అంటే అంత పిచ్చా..? ఇప్పటికీ ఆమె డైరీలో ఆయన ఫోటో అలానే ఉందా..?
చాలా పద్ధతిగా చీర కట్టుకొని సాయిబాబా టెంపుల్ లో ఆమె తన 2025 న్యూ ఇయర్ కి వెల్కమ్ చెప్పింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతూ వైరల్ గా మారాయి . అయితే ఇదే మూమెంట్లో ఇంత చక్కటి బ్యూటీ సాయి పల్లవి టేస్ట్ ఏంటి..? ఆమె ఫేవరెట్ హీరో ఎవరు? ఆమె ఫేవరెట్ హీరోయిన్ ఎవరు ..? అంటూ సోషల్ మీడియాలో తెగ కామెంట్స్ వినిపిస్తున్నాయి . అయితే గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సాయి పల్లవి తన ఫేవరేట్ హీరో, హీరోయిన్ అనే విషయం బయట పెట్టింది.
"తాను సిమ్రాన్ నటనను.. డాన్సింగ్ స్టైల్ ని బాగా ఇష్టపడతాను అని చెప్పుకొచ్చింది". దానికి సంబంధించిన వీడియోను బాగా ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు. అదేవిధంగా సాయి పల్లవికి మమ్ముట్టి గారి నటన అన్న.. కమల్ హాసన్ గారి యాక్టింగ్ స్టైల్ అన్నా చాలా చాలా ఇష్టమట. వాళ్ళ సినిమాలు రిలీజ్ అయితే చిన్నప్పుడు అస్సలు మిస్ కాకుండా చూసేదట. అంతేకాదు కమల్ హాసన్ ఫోటోని ఇప్పటికే ఆమె తన పర్సనల్ డైరీలో అలాగే దాచిపెట్టుకొని ఉందట . దీంతో సాయి పల్లవి ఎంత ఇష్టపడుతుంది కమల్ హాసన్ ని అనే విషయం బయటపడినట్లుంది . సోషల్ మీడియాలో ఇప్పుడు సాయి పల్లవికి సంబంధించిన ఇదే న్యూస్ బాగా ట్రెండ్ అవుతూ వైరల్ గా మారిపోయింది..!