"ఆ విషయం సమంతకి ముందే తెలుసు"..బిగ్ బాంబ్ పేల్చిన కీర్తి సురేష్..!
అసలు కీర్తి సురేష్ ఎందుకు ఈ సినిమాలో నటించింది..? బకరా అయిపోయింది..? అంటూ కూడా మాట్లాడుకున్నారు జనాలు . అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో కీర్తి సురేష్ తన పర్సనల్ లైఫ్ కి సంబంధించిన విషయాలపై రియాక్ట్ అయింది . మరీ ముఖ్యంగా తన ప్రేమ ఎలా మొదలైంది ..? అంటోనీతో పరిచయం ఎలా స్టార్ట్ అయింది..? ప్రేమ పెళ్లి వరకు ఎలా వెళ్ళింది..? అసలు ఆమె ప్రేమ మేటర్ ఇండస్ట్రీలో ఎవరికి తెలుసు..? అన్న విషయాలు ఓపెన్ గానే చెప్పింది .
కీర్తి సురేష్ మాట్లాడుతూ.."12వ తరగతి చదువుతున్నప్పుడే నాకు ఆంటోనీకు పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత అది ప్రేమగా మారింది . 2010లో ఆయన నాకు ప్రపోజ్ చేశాడు. అప్పటినుంచి మా బంధం మరింత బలపడింది . నేను ఆంటోనీతో ప్రేమలో ఉన్న విషయం చాలా తక్కువ మందికే తెలుసు . నాకు క్లోజ్ ఫ్రెండ్స్ కి అదేవిధంగా ఇండస్ట్రీలో ఉండే కొంతమంది స్టార్స్ కి మాత్రమే తెలుసు . సమంత ,విజయ్ ,అట్లీ ,ఐశ్వర్య లక్ష్మి వీళ్ళకు మాత్రమే మా ప్రేమ వ్యవహారం తెలుసు "అంటూ చెప్పుకొచ్చింది. దీంతో సోషల్ మీడియాలో ఇప్పుడు కీర్తి సురేష్ పెళ్లి మేటర్ లో సమంతని కూడా లాగుతున్నారు . సమంతకి కీర్తి సురేష్ లవ్ మేటర్ ముందే తెలుసా..? మరి సోషల్ మీడియాలో ఆమె ఎవరినో పెళ్లి చేసుకోబోతుంది అంటూ రకరకాలుగా వార్తలు వినిపించినప్పుడు.. అదంతా ఏమీ లేదు అంటూ ఒకసారి అయినా స్పందించలేదు..? అంటూ సమంతకి అసలు అనవసరమైన మేటర్ లో కూడా లాగుతున్నారు.. కొందరు ఆకతాయలు. సోషల్ మీడియాలో ఇప్పుడు సమంత పేరు మారుమ్రోగిపోతుంది..!