ఇండియన్ సినీ పరిశ్రమలో అత్యంత ఎక్కువ కలెక్షన్లు వచ్చే అవకాశం ఉన్న పరిశ్రమలలో హిందీ పరిశ్రమ మొదటి స్థానంలో ఉంటుంది. హిందీ ప్రేక్షకుల ఆదరణ దక్కిన సినిమాలకు అద్భుతమైన కలెక్షన్లు వస్తూ ఉంటాయి. ఇకపోతే సౌత్ లో అద్భుతమైన విజయాలు అందుకున్న కొన్ని సినిమాలను ఈ మధ్య కాలంలో వరుస పెట్టి హిందీ లో రీమిక్ చేస్తున్న సందర్భాలు మనం చూస్తేనే వస్తున్నాం. కానీ అలా ఈ మధ్య కాలంలో సౌత్లో మంచి విజయాలు సాధించిన సినిమాలను హిందీలో రీమిక్ చేయగా దాదాపు హిందీ ప్రేక్షకులను ఆకట్టుకొని సినిమాలే ఎక్కువ శాతం ఉన్నాయి.
తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన విజయం అందుకున్న జెర్సీ , హిట్ ది ఫస్ట్ కేస్ , అలా వైకుంటపురంలో మూవీ లను తెలుగులో రీమేక్ చేశారు. ఈ సినిమాలు మంచి అంచనాల నడుమ విడుదల అయిన హిందీ ప్రేక్షకులను మాత్రం ఆకట్టుకోలేదు. కొన్ని సంవత్సరాల క్రితం తమిళ నటుడు తలపతి విజయ్ హీరోగా అట్లీ దర్శకత్వంలో తేరి అనే మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ రూపొందిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా తమిళ బాక్సాఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ సినిమాను పోలీసోడు అనే పేరుతో తెలుగులో విడుదల చేయగా ఈ మూవీ టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర కూడా మంచి విజయాన్ని అందుకుంది.
ఇలా తమిళ్ , తెలుగు భాషల్లో విడుదల అయ్యి మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమాను ఈ మూవీ దర్శకుడు అయినటువంటి అట్లీ నిర్మాతగా వరుణ్ ధావన్ హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్గా బేబీ జాన్ అనే టైటిల్ తో హిందీ లో రూపొందించాడు. ఈ మూవీ ని డిసెంబర్ 25 వ తేదీన విడుదల చేశారు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా కూడా భారీ స్థాయి కలెక్షన్లను వసూలు చేయలేకపోతుంది. దానితో అనవసరంగా సౌత్లో హిట్ అయిన సినిమాలను హిందీలో అనవసరంగా రీమేక్ చేస్తున్నారు. వాటి వల్ల పెద్దగా ప్రయోజనం ఉండడం లేదు అని చాలా మంది జనాలు అభిప్రాయ పడుతున్నట్లు తెలుస్తుంది.