మెగా ఫ్యామిలీలో అలా..అల్లు ఫ్యామిలీలో ఇలా..ఏంట్రా ఈ దరిద్రం..!
మెగా ఫ్యామిలీ కూడా అదే విధంగా "న్యూ ఇయర్" ని తమ సొంత ఇంట్లోనే చేసుకోవాలి అని డిసైడ్ అయ్యిందట . మెగాస్టార్ చిరంజీవి కొడుకు రామ్ చరణ్ ఇంట్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకోవడానికి ఫుల్ పక్కా ప్లాన్ తో రెడీ అయిపోయారు మెగా కుటుంబ సభ్యులు . అయితే అల్లు ఫ్యామిలీ లో మాత్రం ఆ ఆనందం వేరేలా ఉంది . అల్లు ఫ్యామిలీ "న్యూ ఇయర్" సెలబ్రేషన్స్ అంటూ ఏ విధంగా ఏమి చేయడం లేదట . పని వాళ్లకు స్వీట్లు బట్టలు కొనిచ్చారు తప్పిస్తే .. ఎక్కడ కూడా అల్లు ఫ్యామిలీలో ఆ "న్యూ ఇయర్" వైబ్ అనేటివి కనిపించట్లేదు. దానికి కారణం మనకు తెలిసిందే.
అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యి బెయిల్ పై ఉన్నాడు. అల్లు అర్జున్ మళ్లీ జైల్లోకి వెళ్తాడా..? లేదా బెయిల్ క్యాన్సిల్ అయ్యి ఇంకో నాలుగు నెలలు జైల్లో ఉంటాడా..? అనేది ప్రశ్నార్థకంగా మారింది . జనవరి 3వ తేదీ ఆ విషయంపై క్లారిటీ వస్తుంది. ఇలాంటి మూమెంట్ లో అల్లు అర్జున్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎలా చేసుకుంటాడు ..? అంటూ ఫ్యాన్స్ బాధపడిపోతున్నారు. అల్లు అర్జున్ సైతం అసలు న్యూ ఇయర్ అన్న విషయాన్ని మరిచిపోయి పార్టీలు అన్న పదం పక్కన్న పెట్టేసి ..అస్సలు ఏం జరగబోతుంది ..? అసలు జనవరి 3న తర్వాత లైఫ్ ఎలా మారబోతుంది ..? అంటూ ఆలోచిస్తున్నారట . మెగా ఫ్యామిలీ ఏమో హ్యాపీగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకుంటుంది . అల్లు ఫ్యామిలీ ఏమో నెక్స్ట్ ఏం జరగబోతుంది..? అనే విషయం కారణంగా టెన్షన్ పడుతుంది . ఇదే కదా దరిద్రం అంటే .. పుష్ప2 సినిమా మూమెంట్లో ఎలా ఉన్నావ్..? ఇప్పుడు ఎలా ఉన్నావ్..? అంటూ దారుణంగా బన్నీను ట్రోల్ చేస్తున్నారు..!