టీఈర్పీ కోసం ఇంత దిగజారాలా? ఇదేం పాడు బుద్ధి శ్రీముఖి
ప్రేమించినవాడు మరో అమ్మాయితో డాన్స్ చేస్తుంటే ఏ అమ్మాయి అయిన చూసి తట్టుకోలేదు అంటూ ప్రేక్షకులు సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. షోలో కావ్యని, యాంకర్ శ్రీముఖి చాలా ఇబ్బంది పెట్టిందని బ్యాడ్ కామెంట్స్ పెట్టడం జరిగింది. దీంతో శ్రీముఖి షోలో చేసేవాన్ని టీఈర్పీ కోసం మాత్రమే.. దాన్ని ఎవరు ఇంకోలా తీసుకోకండి అని చెప్పింది. నన్ను వారిద్దరి మధ్యలో వెళ్లలేదని.. అది అంతా షోలో భాగంగా చేసిందని శ్రీముఖి క్లారిటీ ఇచ్చింది.
అయితే ఇంతకుముందు నిఖిల్ హీరోగా నటించిన గోరింటాకు సీరియల్ లో హీరోయిన్ రోల్ లో కావ్య శ్రీ నటించింది. వీరిద్దరూ రిలేషన్ షిప్ లో కూడా ఉన్నారు. అయితే నిఖిల్ బిగ్ బాస్ కి వెళ్ళే ముందు వారికి గొడవ అయిందని సమాచారం. నిఖిల్ బిగ్ బాస్ కి వెళ్లక బయట నాకు వేరే ఉన్నారని.. బ్రేకప్ అయిందని నిఖిల్ అన్నాడు. బిగ్ బాస్ నుండి బయటికి వెళ్లిన తర్వాత తనని కలుస్తానని, తనపై ఉన్న ప్రేమని మళ్లీ వ్యక్తపరుస్తానని ఎమోషనల్ అయ్యాడు. కానీ నిఖిల్ హౌస్ నుండి బయటికి వచ్చి రోజులు గడిచాయి కానీ తాను కావ్య శ్రీ కలవడానికి వెళ్లలేదు. ఇక ఇటీవల జరిగిన స్టార్ మా పరివార్ లో ఇద్దరు ఒక్కరికీ ఒక్కరూ ఎదురుపడ్డారు.