పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నమ్రత శిరోద్కర్ కాంబోలో అప్పట్లో ఓ సినిమా వచ్చేదట.కానీ కొన్ని కారణాలవల్ల ఈ సినిమా మిస్ అయినట్టు తెలుస్తోంది. మరి ఇంతకీ పవన్ కళ్యాణ్ నమ్రత కాంబోలో మిస్ అయిన ఆ సినిమా ఏంటి.. పవన్ కళ్యాణ్ వద్దన్నారా.. లేక నమ్రత నటించలేదా అనేది ఇప్పుడు చూద్దాం. చాలామంది డైరెక్టర్లు ఒక హీరో హీరోయిన్ ని ఊహించుకొని కథ రాసుకుంటారు. కానీ తీరా వారికి కథ చెబితే కొంతమందికి నచ్చక రిజెక్ట్ చేస్తే మరి కొంత మందికి డేట్స్ ఖాళీ లేక చేయరు.అలా పవన్ కళ్యాణ్ నమ్రత శిరోద్కర్ కాంబోలో కూడా ఓ సినిమా మిస్ అయ్యిందట.అయితే ఆ సినిమా పవన్ కళ్యాణ్ చేసినప్పటికీ నమ్రత అందులో హీరోయిన్ పాత్రను మిస్ చేసుకుంది.ఇక నమ్రత శిరోద్కర్ పవన్ కళ్యాణ్ తో నటించకపోయినప్పటికీ పవన్ కళ్యాణ్ అన్నయ్య చిరంజీవితో అంజి సినిమాలో మాత్రం నమ్రత నటించింది.
కానీ ఈ సినిమా భారీ అంచనాలతో వచ్చి పెద్ద డిజాస్టర్ అయింది.ఈ విషయం పక్కన పడితే పవన్ కళ్యాణ్ నమ్రత శిరోద్కర్ కాంబోలో మిస్ అయిన సినిమా ఏంటో కాదు బద్రి.. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన బద్రి సినిమాలో పూరి జగన్నాథ్ ముందుగా ఈ సినిమాలో అమీషా పటేల్ రోల్ కోసం నమ్రత శిరోద్కర్ ని ఫిక్స్ చేశారట. ఇక నమ్రత అప్పటికే బిజీ హీరోయిన్ అయినప్పటికీ భారీ రెమ్యూనరేషన్ ఆఫర్ చేయడంతో సినిమా చేయడానికి ఒప్పుకుందట. కానీ షూటింగ్ స్టార్ట్ చేసే సమయం కి నమ్రత తను మొదట ఒప్పుకున్న షూటింగ్లో ఉండడం కారణంగా డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో సినిమా నుండి తప్పుకుంది.
ఈమె తప్పుకోవడం తోనే బాలీవుడ్ లో మరో నటి అయినటువంటి అమీషా పటేల్ ని పూరి జగన్నాథ్ రంగంలోకి దింపారు. ఇక అప్పట్లో చాలామంది ముంబై హీరోయిన్లను పూరి జగన్నాథ్ సౌత్ ఇండస్ట్రీకి పరిచయం చేసిన సంగతి మనకు తెలిసిందే.అలా అమీషా పటేల్ ని కూడా బద్రి సినిమా ద్వారా సౌత్ ఇండస్ట్రీశకి డైరెక్టర్ పూరి జగన్నాథ్ పరిచయం చేశారు. అలా ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కి జోడిగా అమీషా పటేల్ రేణు దేశాయ్ లు నటించారు. ఇక అమీషా పటేల్ కంటే ముందు ఈమె పాత్రకి నమ్రతని అనుకున్నప్పటికీ అనుకోని కారణాలవల్ల ఈ సినిమా నుండి నమ్రత తప్పుకుంది.ఒకవేళ వీరి కాంబోలో సినిమా వచ్చుంటే బాక్సాఫీస్ షేక్ అయ్యేది అంటూ ఈ విషయం తెలిసిన నెటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు