డాకు మహారాజ్ కోసం సింహ ఫార్ములా.. వర్కౌట్ అయ్యేనా..?

Pulgam Srinivas
నందమూరి నట సింహం బాలకృష్ణ కొన్ని సంవత్సరాల క్రితం బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన సింహ అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో నయనతార , స్నేహ ఉల్లాల్ , నమిత హీరోయిన్లుగా నటించారు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో బాలకృష్ణ రెండు పాత్రలలో నటించారు. అందులో ఒక పాత్రలో తండ్రిగా , మరొక పాత్రలో కొడుకుగా కనిపించాడు.

తండ్రి పాత్రలో కనిపించిన బాలయ్యకు జోడిగా నయనతార కనిపించగా , కొడుకు పాత్రలో నటించిన బాలయ్య కు జోడిగా స్నేహ ఉల్లాల్ నటించింది. ఇక కొడుకు పాత్రలో నటించిన బాలయ్య ఈ సినిమాలో కాలేజీలో లెక్చరర్ పాత్రలో కనిపించాడు. ఆయనకు సైట్ వేస్తూ తన ప్రేమలో దించుకోవాలి అని ప్రయత్నాలు చేసే ముద్దుగుమ్మ పాత్రలో నమిత నటించగా వీరిద్దరి మధ్య ఓ సాంగ్ కూడా ఉంటుంది. దాదాపు ఇదే సినిమా ఫార్ములాను ప్రస్తుతం బాలయ్య హీరోగా నటించిన డాకు మహారాజ్ సినిమా విషయంలో ఈ మూవీ దర్శకుడు అయినటువంటి బాబి ఫాలో అవుతున్నట్టు తెలుస్తోంది. ఈ మూవీ లో కూడా బాలయ్య రెండు పాత్రలలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాలో ఊర్వశి రౌటేలా , ప్రగ్యా జైస్వాల్ , శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్ లుగా కనిపించనున్నారు. ఇక ఈ మూవీ లో ఊర్వశి ఓ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ముద్దుగుమ్మ ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ కానప్పటికీ ఈమెపై ఒక సాంగ్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మరి సింహ ఫార్ములాతో బాబి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు అని కొంత మంది భావిస్తున్నారు. మరి ఈ మూవీ ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: