మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొంత కాలం క్రితం రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ ఆర్ ఆర్ అనే సినిమా ద్వారా అద్భుతమైన విజయాన్ని , ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకున్నాడు. ఈ మూవీ తర్వాత చరణ్ తన తండ్రి అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి హీరో గా రూపొందిన ఆచార్య మూవీ లో ఓ కీలకమైన పాత్రలో నటించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. రామ్ చరణ్ తాజాగా శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే సినిమాలో హీరోగా నటించాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాకు తమన్ సంగీతం అందించాడు.
సూర్య విలన్ పాత్రలో నటించిన ఈ సినిమాలో అంజలి , సునీల్ , శ్రీకాంత్ , నవీన్ చంద్ర , జయరాం ముఖ్య పాత్రలలో నటించారు. కియార అద్వానీ ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ సినిమాని వచ్చే సంవత్సరం జనవరి 10 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇక నిన్న రామ్ చరణ్ అభిమానులు ఓ భారీ కట్ అవుట్ ను ఏర్పాటు చేశారు. ఇక ఈ కటౌట్ ఆవిష్కరణలో భాగంగా ఓ ఈవెంట్ ను నిర్వహించగా దానికి గేమ్ చేంజర్ మూవీ నిర్మాత అయినటువంటి దిల్ రాజు విచ్చేశాడు. ఈ ఈవెంట్లో భాగంగా దిల్ రాజు ఆసక్తికరమైన అప్డేట్లను తెలియజేశాడు. గత కొన్ని రోజులుగా గేమ్ చేంజర్ మూవీ ట్రైలర్ను వచ్చే సంవత్సరం జనవరి 4 తేదీన విడుదల చేసే అవకాశం ఉంది అని ఓ వార్త వైరల్ అవుతున్న విషయం మన అందరికీ తెలిసిందే.
తాజా ఈవెంట్లో భాగంగా దిల్ రాజు మాట్లాడుతూ ప్రస్తుతం గేమ్ చేంజర్ ట్రైలర్ నా మొబైల్ లో ఉంది. కాకపోతే ఇంకా దానికి సంబంధించిన కొన్ని పనులు పూర్తి కావాల్సి ఉంది. ఆ పనులు పూర్తయ్యాక ఈ సినిమా ట్రైలర్ను విడుదల చేస్తాం. ఈ మూవీ ట్రైలర్ను జనవరి 1 వ తేదీన మీరంతా కూడా చూసేరు. అంటూ ఈ సినిమా ట్రైలర్ను జనవరి 1వ తేదీన విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు దిల్ రాజు నిన్నటి ఈవెంట్లో ప్రకటించాడు.