టాలీవుడ్ లో 2024 సినిమా స్క్రీన్‌కు మంచి జోష్ ఇచ్చింది. షాకింగ్ డిజాస్టర్ సినిమాలు చాలానే ఉన్నా ఓవరాల్‌గా 2024 టాలీవుడ్‌కు బిగ్ బూస్ట్ ఇచ్చింది. బిగ్ నెంబర్స్‌ను అందించింది. అదే జోరు కొత్త ఏడాదిలో కనిపించబోతోంది.అప్ కమింగ్ సినిమాల లిస్ట్‌లో బిగ్ నెంబర్స్ సాధించగలిగే మూవీస్ గట్టిగానే కనిపిస్తున్నాయి.ఈ క్రమంలోనే భారీ అంచనాలతో 2025లో రాబోతున్న సినిమాలలో మెగాస్టార్ విశ్వంభర ఒకటి.చాలా కాలం తరువాత ఫాంటసీ మూవీ చేస్తున్న చిరు, విశ్వంభర గా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమా సంక్రాంతి బరిలోనే రిలీజ్ కావాల్సి ఉన్నా కొడుకు కోసం సైడ్ ఇచ్చారు. దీంతో విశ్వంభర రిలీజ్ సమ్మర్‌కు షిప్ట్ అయ్యింది.అయితే భారీ బడ్జెట్ సినిమాల మధ్య కొంత గ్యాప్ ఉండాలనే చిరంజీవి ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు ప్రొడ్యూసర్ విక్రమ్ చెప్పారు.
ఇదిలావుండగా ఈ సినిమా విషయానికొస్తే విశ్వంభర టాకీపార్ట్ మొత్తం కంప్లీట్ అయ్యిందని, ఓ సాంగ్ షూట్ మాత్రమే బ్యాలెన్స్‌గా మిగిలివుందని డైరెక్టర్ వశిష్ఠ అన్నాడు. కంప్లీట్ ఫిక్షనల్ స్టోరీతో ఫాంటసీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా విశ్వంభర మూవీని తెరకెక్కిస్తోన్నట్లు డైరెక్టర్ తెలిపాడు.సినిమాలో ఐదు పాటలు ఉంటాయని చెప్పాడు.విశ్వంభర ట్రైలర్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. టీజర్‌లోని ఫాంటసీ, గ్రాఫిక్స్ అంశాలతో పాటు చిరంజీవిపై తెరకెక్కించిన యాక్షన్ ఎపిసోడ్స్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. సంక్రాంతికి వాయిదాపడిన విశ్వంభర మూవీని మే 9న రిలీజ్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. మే 9న చిరంజీవి జగదేకరుడు అతిలోక సుందరి రిలీజైంది. ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఆ సెంటిమెంట్‌ను కంటిన్యూ చేయాలనే ఆలోచనలో ప్రొడ్యూసర్లు ఉన్నట్లు సమాచారం.విశ్వంభర మూవీని దాదాపు 100 కోట్ల బడ్జెట్‌తో యూవీ క్రియేషన్స్ సంస్థ ప్రొడ్యూస్ చేస్తోంది.
ఈ సినిమాలో చిరంజీవివి జోడీగా త్రిష హీరోయిన్‌గా నటిస్తోంది. ఆషికా రంగనాథ్, మీనాక్షి చౌదరి కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నాడు.ఇదిలావుండగా సమ్మర్ కానుకగా విశ్వంభర సినిమా రానున్న నేపథ్యంలో కచ్చితంగా మంచి వసూళ్లు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఇదిలావుండగా విశ్వంభర చిత్రం కోసం ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో విడుదల తేదీ మారడం కాస్త నిరుత్సాహం కలిగిస్తుంది. కానీ ఆలస్యం అయినా మంచి ఔట్ పుట్ రావడం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.ఇదిలావుండగా వీటితో పాటుగా ఒక30, 40 కు పైగా చిన్న చిన్న సినిమాలు వెబ్ సిరీస్ లు విడుదల కావడానికి సిద్ధంగా ఉన్నాయి. మొత్తంగా చూసుకుంటే 2025 లో కూడా పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాల జాతర మొదలుకానుంది.