నందమూరి నటసింహం బాలయ్య గత ఏడాది “భగవంత్ కేసరి “ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు..గత ఏడాది దసరా కానుకగా రిలీజ్ అయిన ఆ సినిమా ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంది.. తెలంగాణ యాసలో బాలయ్య అదరగొట్టాడు..ఈ సినిమాలో బాలయ్య సరసన చందమామ కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది.. అలాగే క్యూట్ బ్యూటీ “శ్రీలీల “ ముఖ్య పాత్ర పోషించింది.. ఇదిలా ఉంటే ఈ ఏడాది బాలయ్య నుంచి ఒక్క సినిమా కూడా రాలేదు.. బాలయ్య నటించిన లేటెస్ట్ మూవీ “ డాకు మహారాజ్ “.. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12 న గ్రాండ్ గా రిలీజ్ కానుంది..స్టార్ డైరెక్టర్ బాబీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగావంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు.. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించింది.. అలాగే ఊర్వశి రౌటెల, చాందిని చౌదరీ కీలక పాత్రలలో నటిస్తున్నారు.. బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ విలన్ గా నటిస్తున్నారు..
సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతుందటంతో మేకర్స్ సినిమా ప్రమోషన్స్ జోరుగా నిర్వహిస్తున్నారు.. కానీ సినిమాపై అంత బజ్ క్రియేట్ అవ్వడం లేదు.. ఈ సినిమాపై ప్రేక్షకులలో ముందు నుంచి అనుమానాలు వున్నాయి.. “ వీర సింహా “ టైటిల్ బదులు “డాకు మహారాజ్” టైటిల్ ను అనౌన్స్ చేయడంతో ఫ్యాన్స్ కాస్త డిసప్పాయింట్ అయ్యారు. మాస్ ఫ్యాన్స్ కు ఈ టైటిల్ అంతగా నచ్చలేదు. క్లాస్ ఫ్యాన్స్ కి అయితే ఈ టైటిల్ ఏంటో కూడా అర్థం కావట్లేదు.. గత సినిమా ప్రమోషన్స్ కి బాలయ్య చూపించిన జోరు ఈ సినిమాకి అంతగా చూపించట్లేదు అని తెలుస్తుంది.. మరి “డాకుమహారాజ్ “ఫ్యాన్స్ ని మెప్పిస్తాడో లేదో చూడాలి.. ఈ సినిమా తరువాత బాలయ్య తన ఫేవరెట్ డైరెక్టర్ బోయపాటితో అఖండ 2 : తాండవం సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి