గేమ్ ఛేంజర్: బెదిరిస్తున్న అభిమాని..ఏకంగా ఆత్మహత్య లెటర్ వైరల్..!

Divya
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం గేమ్ ఛేంజర్. డైరెక్టర్ శంకర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తూ ఉన్నారు..RRR తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా రిలీజ్ అవుతున్న ఈ సినిమా పై అభిమానులకు భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా పాటలకే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేశారు డైరెక్టర్ శంకర్. దిల్ రాజు ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తూ ఉన్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా అప్డేట్ లేకపోవడంతో అభిమానులు తీవ్ర నిరాశని తెలియజేస్తున్నారు.
ఇటీవలి రామ్ చరణ్ అభిమాని ఒకరు ట్రైలర్ రిలీజ్ చేయకుంటే ఆత్మహత్య చేసుకుంటానంటూ మేకర్స్ ను సైతం బెదిరిస్తున్నారు. ఈ విషయం విన్న అభిమానులు సైతం మరింత ఆందోళన చెందుతున్నారు. రామ్ చరణ్ కు ప్రపంచవ్యాప్తంగా భారీగానే ఫ్యాన్ బేస్ ఉన్నది. గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్ జరిగి ఇప్పటికీ కొన్ని నెలలు కావస్తువున్న ఈ సినిమా నుంచి పోస్టర్స్ ,సాంగ్స్ ,టీజర్స్ మాత్రమే రిలీజ్ చేశారు. తాజాగా ఇప్పుడు ఈ సినిమా ట్రైలర్ కోసం అభిమానులు కూడా ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నప్పటికీ వీటి గురించి ఎలాంటి అప్డేట్ లేదు.

జనవరి 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా ఇప్పటివరకు ట్రైలర్ ని కూడా రిలీజ్ చేయలేదు ప్రమోషన్స్ ను కూడా పెద్దగా చేస్తున్నట్లు ఎక్కడ కనిపించకపోవడంతో సోషల్ మీడియాలో అభిమానులు కూడా పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.. తాజాగా ఒక అభిమాని ట్రైలర్ రిలీజ్ చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ తెలియజేస్తున్నారు.."బ్రతికి ఉంటే అందరితో చూస్తా చస్తే ఆత్మలాగా చూస్తాను ఇదంతా కూడా మీ చేతులలోనే ఉంది అంటూ రాంచరణ్ అభిమాని ఒకరు బెదిరిస్తూ ఒక లేఖను రాయడం జరిగింది". మరి అభిమానుల కోరిక మేరకు చిత్ర బృందం గేమ్ ఛేంజర్ ట్రైలర్ రిలీజ్ చేస్తారేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: