యాంకర్ వర్షిని ప్రతి ఒక్కరికి సుపరిచితమే. పటాస్ 2 షో యాంకర్ గా ఎంట్రీ ఇచ్చిన వర్షిని తెలుగు తెరపై ప్రేక్షకులను ఆకట్టుకుంది. తన అమాయకమైన మాటలు, నటన, అందంతో కుర్రాళ్ళ గుండెల్లో నిద్ర లేకుండా చేసింది. ఓవైపు రియాలిటీ షోలతోనూ, మరోవైపు వెబ్ సిరీస్ లతోను యాంకర్ వర్షిని బిజీగా ఉంటుంది. మోడలింగ్ ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వర్షిని మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది. చందమామ కథలు సినిమాతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైంది ఈ చిన్నది.
ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చినప్పటికీ వర్షిణిని ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. అనంతరం వరసగా రెండు మూడు సినిమాలలో హీరోయిన్ గా నటించింది. అవన్నీ చిన్న సినిమాలు కావడంతో వర్షినికి పెద్దగా గుర్తింపు రాలేదు. అనంతరం యాంకరింగ్ వైపు అడుగులు వేసింది. ఇక యాంకర్ గా ఈ బ్యూటీకి మంచి మార్కులు పడ్డాయి. హాట్ యాంకర్ గా గుర్తింపు పొందిన వర్షిని సినిమాలలో కూడా నటించింది.
తన అందాలతో మాయ చేసింది. అంతేకాకుండా ఢీ షో లో టీం లీడర్ గా కూడా వ్యవహరించింది. కొన్ని సందర్భాలలో అభిమానులను కడుపుబ్బ నవ్వించేది. తన డ్యాన్స్ తో చిందులు వేసేది. ఇక సోషల్ మీడియాలోనూ వర్షినికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటుంది. వరుస పెట్టి ఫోటోషూట్లు చేస్తూ సోషల్ మీడియా వేదికగా పంచుకుంటుంది.
ఇదిలా ఉండగా వర్షిని ఐపీఎల్ మ్యాచ్లకు ప్రతిసారి వెళుతూ ఉండడం మనందరం చూస్తూనే ఉంటాం. అయితే వర్షినికి క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి అంటే చాలా ఇష్టమని చెప్పింది. ఈరోజు నితీష్ కుమార్ రెడ్డి సెంచరీ చేసిన సందర్భంలో వర్షిని అతడిని గుర్తు చేసుకుంటూ సంబరపడుతోందని వార్తలు వస్తున్నాయి. దీన్నిబట్టి నితీష్ కుమార్ రెడ్డి పైన యాంకర్ వర్షిని మోజు పడుతుందని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.