ప్రభాస్ నుంచి నయనతార వరకు ... లగ్జరీ ప్రైవేట్ జెట్స్ ఉన్న స్టార్స్ వీరే..!
రామ్ చరణ్ కూడా ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నాడు .. ప్రస్తుతం వచ్చే సంక్రాంతికి గేమ్ చేంజర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు .. అలాగే ఆయన దగ్గర కూడా కోట్ల విలువచేసే ట్రూజెట్ ఉందన్న విషయం ఇప్పటికే చాలామందికి తెలుసు. ఇక ఈ ప్రవేట్ జెట్ ఆయన అత్యంత విలువైన ఆస్తులలో ఒకటి అని కూడా అంటారు. ఇక చరణ్ ఈ జెట్ ను తన ఫ్యామిలీతో వెకేషన్ తో పాటు సినిమాల ప్రత్యేక ఈవెంట్స్ కి వెళ్లడానికి వాడతాడు. ఇక పాన్ ఇండియ హీరో ప్రభాస్ కూడా ఎంత ఎదిగిన ఒదిగి ఉండే మనస్తత్వం అనగానే గుర్తొచ్చేది ప్రభాస్ .. గత కొన్ని ఏళ్ల నుంచి ఆయన క్రేజ్ ఎవరు ఊహించని రేంజ్ లో ఉంది. ఈ పాన్ ఇండియ హీరో దగ్గర కూడా అత్యంత విలువైన జెట్ ఉంది.
ప్రెసెంట్ టాలీవుడ్ లో ఎక్కడ చేసిన అల్లు అర్జున్ గురించి హాట్ టాపిక్ చర్చ నడుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా భారీ అభిమానులు ఉన్న అల్లు అర్జున్.. భారీ అభిమానులె కాదు ఆస్తులు కూడా భారీగానే సంపాదించాడు .. అందుకే ఆయన లైఫ్ స్టైల్ ఎంతో విలాసవంతంగా ఉంటుంది .. ఆయన దగ్గర కూడా ఆరు సీట్లతో కూడిన ప్రైవేటు జెట్ ఉంది.. ఇక తన భార్య స్నేహారెడ్డితో వివాహం జరిగిన వెంటనే అల్లు అర్జున్ దీన్ని కొన్నాడు. తెలుగు చిత్ర పరిశ్రమకు నాలుగు స్తంభాలుగా ఉన్న దిగ్గజ సినీ కుటుంబాల్లో అక్కినేని ఫ్యామిలీ కూడా ఒకటి.. ప్రస్తుతం అక్కినేని ఫ్యామిలీ దగ్గర కూడా ఒక విలాసవంతమైన ప్రైవేటు జెట్ ఉంది.
ఇక పాన్ ఇండియా స్టార్ గా దూసుకుపోతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా కార్లు , బైకుల మీద ప్రత్యేక ప్రేమ చూపిస్తూ ఉంటారన్న విషయం తెలిసిందే. ఎలాంటి కొత్త రకమైన కారు వస్తే దాన్ని తన గ్యారేజ్ లో ఉండేలా ఎన్టీఆర్ చూసుకుంటాడు .. ఈ ఎన్టీఆర్ దగ్గర కూడా ఓ ప్రైవేటు జెట్ ఉంది.. దీని విలువ సుమారు 8 కోట్లు అని అంటారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దగ్గర కూడా ఒక చార్టెడ్ జెట్ ఉంది ఆయన తన రాజకీయ వ్యవహారాలతో పాటు వ్యక్తిగత పనులు కూడా దీని ఉపయోగిస్తారు ఇక వేరితో పాటు రజనీకాంత్, నయనతార దగ్గర కూడా ఈ ప్రైవేట్ జెట్ లు ఉన్నాయి.