ఆ హీరోల నుంచి డబుల్ ట్రీట్.. 2025లో అభిమన్లకు ఊహించని సర్ప్రైజులు..!
ఇక నటసింహం బాలయ్య కెరీర్ లోను సేమ్ సీన్ కనిపిస్తుంది .. సంక్రాంతికి డాకు మహారాజ్ తో రాబోతున్నాడు నటసింహం. అలాగే ఇప్పటికే అఖండ 2 ప్రీ ప్రొడక్షన్ పనులు మంచి ఊపు మీద జరుగుతున్నాయి .. బోయపాటి ఇదే స్పీడ్ పెంచితే 2025 చివరికల్లా అఖండ తాండవాన్ని థియేటర్లో చూడొచ్చని ఫ్యాన్స్ కోరిక. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి రెండు సినిమాలు వచ్చే కొంత సంవత్సరం పక్కా రావొచ్చు అనేది ఎప్పటినుంచో వినిపిస్తున్న మాట .. ఇప్పటికే హరిహర వీరమల్లు షూటింగ్ పూర్తికావొచ్చింది .. అలాగే ఓజీ కి కూడా ఇంకొన్నాళ్ళు పాటు కాల్ షీట్స్ ఇస్తే కంప్లీట్ అవుతుంది.. సో నెక్స్ట్ ఇయర్ పవన్ కళ్యాణ్ అభిమానులకు డబల్ ధమాకా గట్టిగా రెడీగా ఉంది.
ఇక రామ్ చరణ్ కూడా గేమ్ చేంజర్ తో సంక్రాంతికి పలకరించడానికి రెడీగా ఉన్నాడు .. అలాగే బుచ్చిబాబు ప్రాజెక్టు షూటింగు మొదలుపెట్టాడు.. వచ్చే సంవత్సరం ఇయర్ ఎండింగ్ రిలీజ్ ప్లాన్ చేసుకున్న ఆశ్చర్యపోవక్కర్లేదు. ఇక వీరితో పాటు రేసులో నేనున్నానని నాని కూడా సై అంటున్నాడు.. శ్రీకాంత్ ఓదెల సినిమా, హిట్ 3 తో ప్రేక్షకులను పలకరించడానికి ఈ నేచురల్ స్టార్ రెడీగా ఉంటారన్నది టాక్ .. అన్నీ కుదిరితే ఈ రెండు సినిమాలు కూడా 2025 లోనే వచ్చేస్తాయి .