2024 లో కుర్రాళ్లకు కింద మీద నిల్వనీకుండా ఊపు తెప్పించిన పాట ఏదో తెలుసా..?

Thota Jaya Madhuri
2024 కి బై బై చెప్పాల్సిన టైం వచ్చేసింది . మరి కొద్ది రోజుల్లోనే ..కొద్ది రోజులు అంటే కొద్ది రోజుల్లోనే 2025 కి వెల్కమ్ చెప్పబోతున్నాం. 2024 తీపి జ్ఞాపకాలను ఇచ్చింది. చేదు జ్ఞాపకాలను మిగిల్చింది . అయితే 2024 సినిమా ఇండస్ట్రీకి చాలా చాలా మంచి జ్ఞాపకాలనే ఇచ్చింది .మరి ముఖ్యంగా 2024 సినిమా ఇండస్ట్రీ ఓ ఊపు ఊపేసింది. అంతేకాదు పుష్ప 2 సినిమా ఎప్పుడు లేని విధంగా ఇండియన్ బాక్సాఫీస్ హిస్టరీని తిరగరాసింది. 175 కోట్లతో సెన్సేషనల్ రికార్డు క్రియేట్ చేసింది. అయితే 2024 లో చాలా సినిమాల్లో రిలీజ్ అయిన పాటలు బాగా ఆకట్టుకున్నాయి. అయితే 2024 లో మాత్రం కుర్రాళ్ళ ను ఓ  రేంజ్ లో ఊపేసిన టాప్ 3 పాటలు గురించి ఇప్పుడు మనం ఇక్కడ తెలుసుకుందాం..!!


మరి ముఖ్యంగా జనవరి లో సంక్రాంతి కానుక రిలీజ్ అయిన 'గుంటూరు కారం' సినిమాలోని "కుర్చీ మడత పెట్టి" సాంగ్ రచ్చ రచ్చ లేపేసింది. వామ్మో ఈ సాంగ్ ని చిన్నపిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు . మంచంలో ఉన్న ముసల్లోలు కూడా స్టెప్స్ చేయడానికి ట్రై చేశారు. అంతలా ఓ ఊపు ఊపేసింది . ఆ తర్వాత "దేవర" సినిమాలోని 'చుట్టుమల్లె చుట్టేస్తుంది' ఈ సాంగ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . రీల్స్ అయితే వేలల్లో లక్షల్లోనే చేశారు . ప్రతి ఒక్క అమ్మాయి ఈ పాటను రీల్గా చేస్తూనే వచ్చింది.


మరి ముఖ్యంగా జాన్వీ కపూర్ డాన్స్ ఈ పాటకి బాగా హైలైట్ గా నిలిచింది. ఆ తర్వాత పుష్ప 2 నుండి వచ్చిన "సూసేకి అగ్గి రవ్వ మాదిరి"..సాంగ్ ఓ రేంజ్ లో అల్లాడించేసింది. రష్మిక మందన్నా పర్ఫామెన్స్ అల్లు అర్జున్ ఎక్స్ప్రెషన్స్ అద్దిరిపోయే రేంజ్ లో ఉన్నాయి. అంతేకాదు ఆ తర్వాత వచ్చిన "కిస్సిక్" పాట.. "పీలింగ్స్: పాట ఆకట్టుకునేసింది. అయితే ఈ అన్ని పాటల్లోకి హైలైట్ గా మారింది మాత్రం
"సూసేకి అగ్గి రవ్వ" అని కొంతమంది అంటుంటే మరికొందరు మాత్రం "చుట్టుమల్లె" సాంగ్ బాగా ఆకట్టుకునింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు . మరి మీకు ఏ పాట నచ్చింది . పుష్ప2లోని "సూసేకి అగ్గి రవ్వ" సాంగ్ నా..? లేక "దేవర" సినిమాలోని 'చుట్టుమల్లె' సాంగ్ నా..? కామెంట్స్ రూపంలో మీ ఆన్సర్ ని తెలియజేయండి..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: