విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అర్జున్ రెడ్డి సినిమాతో మంచి హిట్ అందుకున్న విజయ్ ఆ సినిమా అనంతరం వరుసగా కొన్ని సినిమాలలో నటించి రౌడీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. విజయ్ కి యూత్ లో విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తన నటన, యాటిట్యూడ్, డైలాగ్స్ కి ఎంతోమంది అభిమానులు ఉన్నారు. గత కొన్ని రోజుల నుంచి విజయ్ సరైన హిట్స్ లేక సతమతమవుతున్నాడు. ఈ సంవత్సరం ఫ్యామిలీ స్టార్ సినిమాతో ఆకట్టుకున్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం 'VD12' సినిమాతో బిజీగా ఉన్నాడు.
జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా విజయ్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా ఓ సినిమా ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగవంశీ ఈ సినిమా పైన భారీ హైప్ ను క్రియేట్ చేశాడు. VD12 సినిమా రెండు పార్ట్ లుగా రిలీజ్ కాబోతుందని చెప్పాడు. ఈ ఆలోచన సినిమా తీస్తున్న సమయంలో అసలు రాలేదని స్క్రిప్ట్ అనుకున్నప్పుడే రెండు పార్టులుగా ఈ సినిమా తీయాలని ఆలోచన వచ్చిందని నాగ వంశీ అన్నారు.
అసలు సెకండ్ పార్ట్ తీయకపోయినా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే ఫస్ట్ పార్ట్ ఎండింగ్ అంత క్లియర్ గా ఉంటుంది కాబట్టి ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ కి అస్సలు సంబంధమే ఉండదు. మేము అనుకున్నప్పుడు అది రెండు పార్టులుగా అనుకున్నాం. సెకండ్ పార్ట్ తీయాలి కాబట్టి ఫస్ట్ పార్ట్ లో సస్పెన్స్ అనేవి ఏమి కూడా ఉండవు. రెండు సపరేట్ కథలు అంటూ నాగ వంశీ చెప్పుకొచ్చారు. నిర్మాత చేసిన ఈ కామెంట్లు వైరల్ అవుతున్నాయి. కాగా పవన్ మరో వారం రోజుల పాటు డేట్లు ఇస్తే హరిహర వీరమల్లు సినిమాను పూర్తి చేస్తామంటూ దర్శకుడు జ్యోతి కృష్ణ చెబుతున్నారు.
వీరమల్లు సినిమా ఇప్పటికే చాలా ఆలస్యమైందని అన్నాడు. దానివల్ల ఆర్థిక భారం పెరుగుతుందన్నాడు. కనుక ఈసారి ఎలాంటి పరిస్థితుల్లో సినిమా రిలీజ్ వాయిదా వేయకూడదు అనే నిర్ణయానికి వచ్చినట్లుగా చెప్పాడు. కాబట్టి హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అయితే వీడి 12 సినిమా విడుదల కావడం జరుగుతుంది. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న VD12 సినిమాలో హీరోయిన్ గా శ్రీ లీల నటిస్తుంది. కీలక పాత్రలో రష్మిక మందన నటించబోతుందనె వార్తలు వైరల్ అవుతున్నాయి.