హెరాల్డ్ ఫ్లాష్ బ్యాక్ 2024 : "చుట్టమల్లె" పాటతో అందరినీ చుట్టేసిన దేవర.. యూత్ కి మత్తెక్కించిందిగా.!!

Pandrala Sravanthi
మరో మూడు రోజుల్లో 2024 సంవత్సరం ముగుస్తుంది.2025వ సంవత్సరంలోకి అడుగుపెట్టడానికి మూడు రోజులే ఉంది. ప్రస్తుతం ప్రతి ఒకరు కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టగానే ఏ పనులు చేయాలి ఏ పనులు మొదలు పెట్టాలి అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ ఏడాది ముగుస్తుండడంతో ఈ ఏడాదికి సంబంధించిన ఎన్నో విషయాలు నెమరు వేసుకుంటూ ఉంటారు.అలా ఈ ఏడాది మన టాలీవుడ్ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపిన పాటలు ఎన్నో ఉన్నాయి.వాటిలో దేవర సినిమాలోని జాన్వి కపూర్ ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన "చుట్టమల్లే" సాంగ్ ఒకటి.. "చుట్టమల్లే చుట్టేసిందే తుంటరి చూపు" అని సాగే పాట యూత్ ని ఎంతగా అట్రాక్ట్ చేసిందో చెప్పనక్కర్లేదు. ఈ పాటలో ఎన్టీఆర్ జాన్వీ కపూర్ రొమాన్స్ వేరే లెవల్ అని చెప్పుకోవచ్చు. జాన్వి కపూర్ అలా నీళ్లలో కూర్చొని ఈ పాటలో యాక్ట్ చేసిన తీరు ఎంతోమంది యూత్ ని ఆకట్టుకుంది..
 చుట్టమల్లె సాంగ్ రికార్డులు:

 కొన్ని పాటలు విడుదలైన కొద్ది క్షణాల్లోనే ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. అలాంటి పాటల్లో చుట్టమల్లె పాట ఒకటి. ఈ పాట రిలీజ్ చేసిన కొద్ది క్షణాల్లోనే ఎన్నో రికార్డులను కొల్లగొట్టింది. ఈ పాటలో ఎన్టీఆర్ జాన్వి కపూర్ ల రొమాన్స్ చూసి ఎంతో మంది యూత్ ఆకట్టుకున్నారు. ముఖ్యంగా చుట్ట మల్లె పాట యూత్ అందరికి ఒక డ్రగ్ లాగా ఎక్కి మత్తెక్కించింది. ఎవరి నోట చూసినా చుట్టమల్లె పాటనే వినిపించింది. అయితే అలాంటి ఈ పాటలోని రొమాన్స్ విజువల్స్ ఎంతగానో ఆకట్టుకున్నాయి.

ఇక ఈ పాటను చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన సమయంలో విడుదలైన 19 గంటల్లోనే 25 మిలియన్ల వ్యూస్ తో యూట్యూబ్ లోనే ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది. ఇక ఈ పాటలో ఎన్టీఆర్ జాన్వి కపూర్ ల మధ్య కెమిస్ట్రీ ఎంత బాగా కుదిరిందో చెప్పనక్కర్లేదు.అలాగే ఈ పాటకి  బాస్కో మార్టిస్ అద్భుతంగా కొరియోగ్రఫీ చేశారు. అలాగే ఈ పాటని శిల్పారావు ఎంతో మత్తుగా పాడడంతో ఈ పాట విన్న ఎంతోమంది శ్రోతలు అట్రాక్ట్ అయ్యారు. అలాగే ఈ పాటకి అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ అందించారు.అలా కొరియోగ్రఫీ మ్యూజిక్ అద్భుతంగా ఉండడంతోపాటు జాన్వి ఎన్టీఆర్ ల కెమిస్ట్రీ చూసి ఈ పాటకు ఎంతోమంది యూత్ ఫిదా అయిపోయారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: