RRR -2: పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన ఎన్టీఆర్..!

Divya
రాజమౌళి తీసిన ఎలాంటి సినిమా అయినా సరే సినీ ఇండస్ట్రీలో ఒక సంచాలనంగా మారుతుంది. బాహుబలి సినిమా తర్వాత రాజమౌళి సినీ కెరియర్ ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించేలా చేసింది. అందుకే రాజమౌళి సినిమా అంటే డిస్ట్రిబ్యూటర్ల సైతం కొనడానికి చాలా ఇష్టపడుతూ ఉంటారు. 2022లో  విడుదలైన rrr సినిమా ఆ ఏడాదంతా కూడా ఎక్కువగా వినిపించడమే కాకుండా ఆస్కార్ అవార్డు కూడా అందుకోవడం జరిగింది. దీంతో రాజమౌళి సినిమాలు నెక్స్ట్ స్థాయికి తీసుకు వెళ్లడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు మళ్లీ చాలా రోజుల తర్వాత rrr అనే పేరు ఇండియాలో మరొకసారి గట్టిగా వినిపిస్తోంది.

ఇందులో రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరు కూడా గ్లోబల్ స్టార్ గా పేరు సంపాదించారు. ఈ సినిమాలో వీరిద్దరి నటన అద్భుతంగా ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ సినిమా నుంచి లేటెస్ట్ గా విడుదల చేసిన మేకర్స్ ఒక ఎమోషనల్ రోలర్ డాక్యుమెంటరీ చిత్రాన్ని రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ డాక్యుమెంటరీ పూర్తి అయిన తర్వాత టైటిల్స్ కూడా అయిపోయిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తన మార్క్ ఫన్ తో RRR-2 పైన కాస్త ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసినట్లుగా కనిపిస్తోందట.

RRR -2 పైన మీకు ఏమైనా తెలుసా?.. రాజమౌళి గారు ఇప్పటివరకు వీటి గురించి తమకు ఏ విధంగా కూడా అప్డేట్ ఇవ్వలేదని.. పార్ట్ 2 ఉంటుందా లేదా అనేది కూడా తనకు తెలియదు అంటూ ఎన్టీఆర్ టీజ్ చేయడం జరిగిందట. అయితే దీంతో మేకర్స్ సైతం కచ్చితంగా పార్ట్ 2 ఉన్నట్టుగానే ఇంటికి ఇచ్చారని పలువురు అభిమానులు నేటిజన్స్ సైతం కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ క్రేజీ సీక్వెల్ ని సైతం రాజమౌళి ఎప్పుడు మొదలు పెడతారో ఆని అభిమానులు కూడా చాలా ఎక్సైటింగ్గా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం రాజమౌళి మహేష్ తో సినిమా పూర్తి చేయడానికి సిద్ధమవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: