మీ నోళ్లెందుకు లెగ‌లేదు... సినిమా వాళ్ల మీటింగ్‌లో ఒక్క‌సారిగా ఫైర్ అయిన రేవంత్‌..?

RAMAKRISHNA S.S.
- ( హైద‌రాబాద్ , టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్య థియేటర్ దగ్గర ప్రీమియర్ షో ఘటన తర్వాత టాలీవుడ్ వర్సెస్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న వార్తలు ఎక్కువగా వస్తున్నాయి. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి టాలీవుడ్ ప్రతినిధులతో భేటీ అయిన సంగతి తెలిసిందే. దాదాపు రెండు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో టాలీవుడ్ నుంచి పలువురు నిర్మాతలు .. కొందరు హీరోలతో పాటు .. అగ్ర దర్శకులు కూడా హాజరయ్యారు. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి కొన్ని విషయాలు ఇండస్ట్రీ పెద్దల ముందు ఉంచారు. అసెంబ్లీలో తన చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నానని ... చిత్ర పరిశ్రమను ప్రోత్సహిస్తాం పద్ధతిగా ఉండండి .. తాను అసెంబ్లీలో చెప్పిన మాటకు కట్టుబడి ఉన్న ఇకపై బెనిఫిట్ షో లు ఉండవు అని క్లియర్ కట్ గా చెప్పేశారు. అలాగే బౌన్సర్లు పోలీసులను అడ్డుకుంటే వారితో పాటు సెలబ్రిటీల పైన .. కేసులు ఉంటాయని అభిమానులను మీరే నియంత్రించుకోవాలని సూచనలు చేశారు.

సామాజిక బాధ్యతను సినిమా పరిశ్రమ గుర్తుపెట్టుకోవాలని డ్రగ్స్ - గంజాయి నిరోధానికి ప్రచారం చేయాలన్నారు. అలాగే పర్యావరణం - ఆలయ , పర్యటక ప్రచార బాధ్యత అంతా మీదే అని ఇండస్ట్రీ సమస్యలు పరిష్కారానికి మంత్రివర్గ ఉప సంఘం వేయాలని కూడా చెప్పారు. ఇక భట్టి విక్రమార్క అయితే గురు కులాలకు సినీ పరిశ్రమ నుంచి వసూలు చేయాలన్న ఆలోచన ఉందని చెప్పారు. ఈ సమావేశంలో రేవంత్ రెడ్డి ఒక విషయంలో టాలీవుడ్ ప్రతినిధులపై కాస్త ఘాటుగానే వ్యాఖ్యలు చేసినట్టు తెలిసింది. అల్లు అర్జున్ సీఎం పేరు చెప్పనందుకే కేసు అని ప్రచారం చేస్తారా ? ఎప్పుడో ఆ స్థాయి దాటాం మీరు ఎందుకు ? ఖండించలేదు .. కనీసం ఒక్కరంటే ఒక్కరు అయిన ఖండించాలి కదా అని రేవంత్ వారిని ప్రశ్నించడంతో వారి దగ్గర నుంచి ఆన్సర్ లేదట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: