చిరు.. శ్రీదేవి కాంబోలో మిస్ అయిన మూవీ ఏదో తెలుసా.. అంతా ఓకే అయ్యాక క్యాన్సిల్..?

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరి పోయే రేంజ్ క్రేజ్ కలిగిన హీరోలలో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. చిరంజీవి ఇప్పటి వరకు ఎన్నో అద్భుతమైన విజయవంతమైన సినిమాల లో హీరో గా నటించాడు. ఇకపో తే తెలు గు లో అద్భుతమైన స్థాయి ఉన్న హీరోయిన్ గా చాలా సంవత్సరాల పాటు కెరీర్ను కొనసాగించిన వారిలో శ్రీదేవి ఒకరు  . ఇది ఇలా ఉంటే చిరంజీవి , శ్రీదేవి కాంబినేషన్లో చాలా సినిమాలు వచ్చా యి . వీరి కాంబోలో రూపొందిన జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ మూవీ కి రాఘవేంద్రరావు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను అశ్వినీ దత్ నిర్మించాడు.

ఈ మూవీ తర్వాత వీరి కాంబోలో ఎస్ సి పరశురామ్ అనే సినిమా వచ్చింది. ఈ సినిమాలో చిరంజీవి పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించాడు. ఈ సినిమా భారీ అంచనాల నడుమ విడుదల అయింది. కానీ ఈ మూవీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. ఇది ఇలా ఉంటే మెగాస్టార్ చిరంజీవి హీరోగా శ్రీదేవి హీరోయిన్గా రాఘవేంద్రరావు దర్శకత్వంలో అశ్విని దత్ ఓ మూవీ ని ప్లాన్ చేశాడు. కానీ ఆ మూవీ మాత్రం కొన్ని కారణాల వల్ల క్యాన్సిల్ అయింది అంట. ఆ వివరాలు ఏమిటో తెలుసుకుందాం.

చిరంజీవి హీరోగా శ్రీదేవి హీరోయిన్గా రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఓ సినిమాను ప్లాన్ చేశాడట. ఆల్మోస్ట్ అంతా ఓకే అయ్యాక చివరి నిమిషంలో వేరే సినిమాలు తో బిజీగా ఉండడం వల్ల చిరంజీవి ఆ సినిమా నుండి తప్పుకున్నాడట. దానితో ఈ మూవీ బృందం వారు నాగార్జున తో ఆఖరి పోరాటం అనే సేపు టైటిల్ తో  మూవీ ని రూపొందించినట్లు తెలుస్తోంది. ఇక ఆఖరి పోరాటం సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: