ఒకే ఒక్క మాటతో సినీ స్టార్స్ నోర్లు మూయించిన రేవంత్ రెడ్డి.. దటీజ్ సీఎం పవర్..!

Thota Jaya Madhuri
గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో ..సినిమా ఇండస్ట్రీలో ఆ మాటకొస్తే కామన్ పీపుల్స్ కూడా ఎక్కువగా మాట్లాడుకునే విషయం బన్నీ వర్సెస్ రేవంత్ రెడ్డి వార్.  నిజంగానే రేవంత్ రెడ్డి కావాలని బన్నీను టార్గెట్ చేశారా..? లేకపోతే చట్టాన్ని గౌరవిస్తూ ఒక నిండు ప్రాణం బలైపోయిన కారణంగా లీగల్ యాక్షన్స్ తీసుకుంటున్నారా..? రీజన్ ఏంటో తెలియదు కానీ బన్నీపై కూసింత ఘాటు గానే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతున్నారు . అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో అరెస్ట్ అయ్యి మధ్యాంతర బెయిల్ తో బయటికి వచ్చిన విషయం అందరికీ తెలిసిందే.


ఆ తర్వాత అసెంబ్లీలో బన్నీ పేరును ప్రస్తావిస్తూ రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేయడం దానికి కౌంటర్ వేస్తూ అల్లు అర్జున్ .. రేవంత్ రెడ్డి పేరు చెప్పకుండానే ఫైర్ అవుతూ ప్రెస్ మీట్ నిర్వహించడం .. బెయిల్ పై ఉన్న ఒక నిందితుడు ఎలా ప్రెస్ మీట్ పెడతాడు..? అంటూ పోలీసులు మళ్లీ రివర్స్ లో ఆయనకు కౌంటర్ వేయడం ..చిక్కడ పల్లి పోలీస్ స్టేషన్ కి ఎంక్వయిరీ కు వెళ్లడం అన్ని చక చకా జరిగిపోతున్నాయి.  ఆ విషయాలు మొత్తం మీడియాలో చూస్తున్నాం . అయితే అల్లు అర్జున్ అరెస్టు అయిన తర్వాత చాలామంది సినీ ప్రముఖులు అల్లు అర్జున్ ని పరామర్శించడానికి అల్లు ఫ్యామిలి ఇంటికి వెళ్లారు.


చాలామంది స్టార్స్ ఆల్మోస్ట్ ఆల్ ఇండస్ట్రీలో ఉండే పెద్ద స్టార్స్ నుంచి చిన్న స్టార్స్ వరకు అందరు అల్లు అర్జున్ ని పరామర్శించారు . అయితే ఇక్కడే రేవంత్ రెడ్డికి కోపం వచ్చింది. అందుకే అసెంబ్లీలో అడిగి కడిగి పడేసాడు . "ఆయన ఏమన్నా యుద్ధాలు చేసి వచ్చాడా..? కాళ్లు విరిగిందా ..? చెయ్యి విరిగిందా..? పరామర్శించడానికి ఏముంది ..? అదే శ్రీతేజ్ ని ఒక్కడైనా పరామర్శించారా..? అంటూ అడిగి కడిగి పడేసాడు . రేవంత్ రెడ్డి వాలీడ్ పాయింట్ లేవదీశాడు.


ఆ కారణంగానే జనాల  నోటి నుండి కూడా మాట రాలేకపోయింది . బన్నీ ఫాన్స్ కూడా సైలెంట్ అయిపోయారు. మరి ముఖ్యంగా బన్నీ ఫాన్స్ కూడా కొంతమంది బన్నీ నే నెగిటివ్ గా మాట్లాడారు . ఇదే మూమెంట్లో జనాలు రేవంత్ రెడ్డి ని పొగిడేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు సినీ స్టార్స్ ఎవరూ కూడా అల్లు అర్జున్ విషయంలో వేలు పెట్టడం లేదు . ట్వీట్స్ చేయడం లేదు.  అల్లు అర్జున్ ని ఏకాకిగా వదిలేశారు . దీంతో సీఎం రేవంత్ రెడ్డి కరెక్ట్ టైం లో కరెక్ట్ పాయింట్ పట్టాడు అని ఆ ఒక్క మాటతో అందరి నోర్లు మూయించేశాడు అంటూ పొగిడేస్తున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: