గేమ్ ఛేంజర్ లో ఆ రాజకీయ నాయకుడిపై సెటైర్లు.. డైలాగ్స్ లీక్.?

Pandrala Sravanthi
పుష్ప-2 సినిమా విడుదలై భారీ హిట్టవ్వడంతో ప్రస్తుతం అందరికి చూపు రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ ఛేంజర్ మూవీ పైనే ఉంది.ఈ సినిమా చాలాసార్లు వాయిదా పడుతూ క్రిస్మస్ కి విడుదల కాబోతుంది అని ఫైనల్ గా చెప్పారు. కానీ పుష్ప టు విడుదల నేపథ్యంలో గేమ్ ఛేంజర్ సినిమా వెనక్కి తగ్గింది.ఈ సినిమాని సంక్రాంతికి విడుదల చేస్తున్నారు. అలా ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టేసారు చిత్ర యూనిట్.రీసెంట్ గా ఈ సినిమా ప్రమోషన్స్ కోసం రామ్ చరణ్ అమెరికా కూడా వెళ్లారు. శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు 2 మూవీ ఫ్లాప్ అవ్వడంతో మెగా ఫ్యాన్స్ అందరూ గేమ్ ఛేంజర్ సినిమా ఎలా ఉండబోతుందోనని భయపడుతున్నారు. అయితే ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన టీజర్,పాటలు అన్నీ కూడా సినిమాపై భారీ హైప్ పెంచేశాయి.

అయితే తాజాగా విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ సినిమా నుండి కొన్ని డైలాగ్స్ లీక్ అయినట్టు తెలుస్తోంది.అయితే ఆ లీక్డ్ డైలాగ్స్ లో ఏపీలోని ఓ ప్రముఖ రాజకీయ నాయకుడి పై సెటైర్లు వేసినట్టు తెలుస్తుంది.అలాగే గేమ్ చేంజర్ సినిమాలో ఏపీలోని ఓ రాజకీయ నాయకుడు పై తెగ సెటైర్లు వేస్తూ చూపించారట.ఇక ఈ సినిమా రిలీజ్ అయితే మాత్రం ఎంత రచ్చ రచ్చగా ఉంటుందోనని చాలామంది మాట్లాడుకుంటున్నారు. అంతేకాదు సమాజంలో జరిగే సామాజిక అంశాల గురించి సినిమాలు తెరకెక్కించే డైరెక్టర్ శంకర్ ఈ సినిమాలో కూడా తనదైన మార్క్ చూపించారని,ఏపీ తెలంగాణలో జరిగే రాజకీయాల గురించి ఈ సినిమాలో ఎక్కువగా చూపించారని తెలుస్తోంది. ఎందుకంటే ఈ సినిమాకి సంబంధించిన స్టోరీని శంకర్ దాదాపు నాలుగు సంవత్సరాల ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నారని దిల్ రాజు ఓ ఈవెంట్లో బయటపెట్టారు.

అయితే గేమ్ ఛేంజెర్ సినిమాకి సంబంధించి థియేట్రికల్ ట్రైలర్ ఈనెల 27న భారీ అంచనాల మధ్య హైదరాబాద్లోని యూసఫ్ గూడా లో విడుదల చేయబోతున్నారు. అయితే ఈ ట్రైలర్ లో ఓ రాజకీయ నాయకుడికి సంబంధించి సెటైర్లు ఎక్కువగా ఉన్నాయంటూ ఒక వార్త మీడియాలో తెగచక్కర్లు కొడుతోంది. అంతేకాదు ఆ ట్రైలర్ లోని డైలాగ్స్ కూడా లీక్ అయ్యాయి అంటూ ప్రచారం జరుగుతుంది.అయితే ఈ సినిమా చూశాక వింటేజ్ శంకర్ ఈజ్ బ్యాక్ అని చూసిన ప్రతి ఒక్కరు అంటారని సినిమా గురించి కొంతమంది ఇండస్ట్రీ జనాలు మాట్లాడుకుంటున్నారు. మరి చూడాలి గేమ్ ఛేంజర్ ట్రైలర్లో ఏం చూపిస్తారు.. సినిమాలో ఎలాంటి సన్నివేశాలను తెరకెక్కించారు.ఈ సినిమా వల్ల ఎవరి మనోభావాలైన దెబ్బతిని సినిమాకి వ్యతిరేకంగా మారతారా అనేది చూడాల్సి ఉంది

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: