సంగీత దర్శకుడిగా తనకంటూ అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న వారిలో సమ్ సి ఎస్ ఒకరు. ఈయన ఇప్పటివరకు ఎన్నో సినిమాలకు సంగీతం అందించి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇకపోతే ఈయన తెలుగు సినిమాలకు కూడా చాలా కాలంగా సంగీతం అందిస్తూ వస్తున్నాడు. కొంత కాలం క్రితం నిఖిల్ "అర్జున్ సురవరం" అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాకు సమ్ సంగీతం అందించాడు. ఈ సినిమాతో పాటు విజయ్ దేవరకొండ హీరో గా రూపొందిన నోటా , మంచు విష్ణు హీరో గా రూపొందిన మోసగాళ్లు సినిమాకు కూడా సమ్ సంగీతం అందించాడు.
కాకపోతే ఈ మూడు మూవీలు సినిమాలు కూడా పెద్ద స్థాయి విజయాలను అందుకోకపోవడంతో తెలుగు లో సమ్ కి సంగీత దర్శకుడుగా గొప్ప స్థాయి గుర్తింపు దక్కలేదు. ఇకపోతే ఈ సంవత్సరం మాత్రం సమ్ తెలుగు లో తన సత్తా ఏమిటో చాటుకున్నాడు. ఈ సంవత్సరం కిరణ్ అబ్బవరం హీరో గా రూపొందిన "క" అనే సినిమా విడుదల అయిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాకు సమ్ సంగీతం అందించాడు. ఈ మూవీ అద్భుతమైన విజయం అందుకోవడం , ఇందులోని సంగీతానికి ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంసలు రావడంతో సమ్ కి ఈ సినిమా ద్వారా మంచి గుర్తింపు తెలుగులో వచ్చింది.
ఇకపోతే అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన హీరోయిన్గా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప పార్ట్ 2 సినిమాలో కొన్ని సన్నివేశాలకు కూడా సమ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను అందించినట్లు తెలుస్తోంది. ఈ సినిమా కూడా భారీ విజయాన్ని అందుకుంది. ఇలా ఈ సంవత్సరం ఈయన సంగీతం అందించిన రెండు తెలుగు సినిమాలు కూడా అద్భుతమైన విజయాలను అందుకోవడంతో ఈ సంవత్సరం ఈయనకు తెలుగు లో మంచి గుర్తింపు వచ్చింది.