ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో.. నెంబర్ వన్ హీరోయిన్ ఎవరో తెలుసా?
నయనతార, త్రిష, తమన్నా, శ్రీలీల, రష్మిక వంటి వారు చాలా ఎక్కువ మొత్తంగా రెమ్యునరేషన్లు పొందుతున్నారు. అయితే వీరిలో ఓ హీరోయిన్ మాత్రం ఇండియన్ సినిమా ఇండస్ట్రీనే శాసిస్తోందని చెప్పుకోవచ్చు. ఆ హీరోయిన్ మరెవ్వరో కాదు రష్మిక మందన్న. అవును, రష్మిక క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. 'ఛలో' సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రష్మిక, ఆ తర్వాత, తమిళ, కన్నడ, మలయాళ , హిందీ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. తెలుగులో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన రష్మిక మిగతా భాషల్లో కూడా అదే స్థాయి హవా కొనసాగిస్తుండడం విశేషం. ఈ మధ్య శ్రీలీల కాస్తా హడావిడి చేసినప్పటికీ... ఆమె నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ కావడంతో శ్రీలీలపై ఫ్లాప్ హీరోయిన్ ముద్ర పడింది.
పొడుగు కాళ్ల సుందరి పూజా హెగ్దెకు కూడా తెలుగులో పెద్దగా అవకాశాలు లేకపోవడంతో ప్రస్తుతం రష్మిక మందన్నానే టాప్ ప్లేస్‌లో కొనసాగుతున్నారు. ఈ క్రమంలోనే రష్మిక మందన్నా రెమ్యునరేషన్ రికార్డు స్థాయిలో తీసుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. రష్మిక ఒక్కో సినిమాకు దాదాపు 12 నుండి 14 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు గుసగుసలు వినబడుతున్నాయి. ఇంత పెద్ద మొత్తం ఇంతవరకు మరే హీరోయిన్ తీసుకోలేదని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. మరోవైపు ఆమె నటిస్తున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ కావడంతో ఆమె నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతుంది. గతేడాది పుష్ప, సీతరామం, యానిమల్ వంటి సూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకున్న రష్మిక తాజాగా పుష్ప పార్ట్ 2తో తిరుగులేని రికార్డుని సొంతం చేసుకుంది. రష్మిక ఉంటే చాలు సినిమా హిట్ అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. ఈ క్రమంలోనే రష్మిక మందన్నా రాబోవు సినిమాల లిస్ట్ భారీగా ఉందని అంటున్నారు. బాలీవుడ్‌లో షాహిద్ కపూర్, విక్కి కౌషల్‌తో వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా మారింది.