అల్లు అర్జున్ కంటే మోహ‌న్‌బాబే బెట‌ర్ అయ్యాడుగా.. ?

RAMAKRISHNA S.S.
- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . .

టాలీవుడ్ లో ఇటీవ‌ల ఇద్ద‌రు హీరోల‌కు చెందిన అంశాలు కాంట్ర‌వ‌ర్సీ లు అయ్యాయి. ఒక‌టి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న‌టించిన పుష్ప ది రూల్ సినిమా థియేట‌ర్ల లోకి వ‌చ్చి పాన్ ఇండియా రేంజ్ లో సూప‌ర్ హిట్ అయ్యింది. ఈ సినిమా ఇప్ప‌టికే రు . 1600 కోట్ల వ‌సూళ్ల కు చేరువ అయ్యింది. అయితే ఈ సినిమా రిలీజ్ కు ముందు రోజు హైద‌రాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంథ్య థియేట‌ర్ లో వేసిన స్పెష‌ల్ ప్రీమియ‌ర్ షో కు అల్లు అర్జున్ రావ‌డం .. అక్క‌డ జ‌రిగిన తొక్కిస  లాట‌లో రేవ‌తి అనే మ‌హిళ మృతి చెంద‌డం .. ఆమె కుమారుడు తొక్కిస‌లాట‌లో గాయ‌ప‌డి తీవ్ర అప‌స్మార‌క స్థితి లో కి వెళ్లి హైద‌రాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుప‌త్రి లో చికిత్స పొందుతోన్న సంగ‌తి తెలిసిందే.

ఇదే టైంలో టాలీవుడ్ సీనియ‌ర్ హీరో మంచు మోహ‌న్ బాబు కుటుంబం లో ఇద్ద‌రు అన్న‌ద‌మ్ములు మంచు విష్ణు వ‌ర్సెస్ మంచు మ‌నోజ్ మ‌ధ్య తీవ్ర‌మైన గొడ‌వ‌లు జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ రెండు సినిమా హీరోల ఇష్యూ ల‌లో మోహ‌న్‌బాబే బెట‌ర్ అని... అల్లు అర్జున్ తో పోలిస్తే అన్న కామెంట్లు ప‌డుతున్నాయి. మోహ‌న్ బాబు తో పోలిస్తే అల్లు అర్జున్ పై విమర్శలు రావడానికి ప్రధాన కారణం కూడా చెపుతున్నారు. అసెంబ్లీ లో రేవంత్ రెడ్డి ప్ర‌సంగం త‌ర్వాత బ‌న్నీ పెట్టిన ప్రెస్ మీట్ లో పశ్చాత్తాపం బాధ కానీ ఆ  ఫేస్ లో కనపడటం లేదు అన్న కామెంట్లు సోష‌ల్ మీడియాలో ప‌డుతున్నాయి.

క‌నీసం బ‌న్నీ ఆ పిల్లల బాధ్యత తీసుకుంటా అనే ఒక్క మాట అని ఉన్న కూడా కొన్ని విమర్శలకు చెక్ పడేదని.. కేవలం తన పై వచ్చిన విమర్శ లకు క్లారిటీ ఇవ్వడానికి వచ్చాడన్న టాక్ న‌డుస్తోంది. బ‌న్నీ అలా వచ్చి మాట్లాడి వెళ్ళాడు. అల్లు కంటే మోహన్ బాబు నే బెస్ట్ అనిపించాడు ... కుటుంబం అంత వెళ్లి విలేకరి నీ క్షమాపణ అడిగారు క‌దా ? అని ఇండ‌స్ట్రీ వాళ్లే కొంద‌రు చ‌ర్చించుకుంటున్నారు.  బ‌న్నీ లీగల్ స‌మ‌స్య ఉంద‌ని చెప్పినా ప్రెస్ మీట్‌కు లీగ‌ల్ స‌మ‌స్య లేదా ? అన్న టాపిక్ కూడా తెర‌మీద‌కు వ‌స్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: