తమిళ స్టార్ హీరో విశాల్ నటించిన లేటెస్ట్ యాక్షన్ మూవీ రత్నం. తమిళ్ స్టార్ డైరెక్టర్ హరి ఈ సినిమాను తెరకెక్కించాడు. మాస్ సినిమాలకు దర్శకుడు హరి చాలా ఫేమస్ ముఖ్యంగా ఆయన తెరకెక్కించిన సింగం సిరీస్ లు ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకున్నాయి.. అయితే హీరో విశాల్ తో దర్శకుడు హరి గతంలో “పూజ” అనే సినిమా తెరకెక్కించాడు..దర్శకుడు హరి తన స్టైల్ ఆఫ్ మాస్ అండ్ యాక్షన్ ఎలిమెంట్స్ తో పూజా సినిమాను తెరకెక్కించాడు.. హాట్ బ్యూటీ శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఆ సినిమా ప్రేక్షకులకి విపరీతంగా నచ్చింది.. పూజా సినిమా మంచి విజయం సాధించింది.తాజాగా పూజా కాంబినేషన్ లో ” రత్నం” అనే మాస్ మూవీ రావడంతో ప్రేక్షకులు ఈ సినిమాపై భారీగా అంచనాలు పెట్టుకున్నారు..ఈ ఏడాది ఏప్రిల్ 26న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తొలి రోజు నుంచే మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది.. దీనితో రత్నం మూవీ బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. తెలుగులో కూడా ఈ సినిమానీ రిలీజ్ చేయగా అక్కడ మరీ దారుణమైన కలెక్షన్లు సాధించింది. దీంతో ఈ సినిమాను మేకర్స్ నెల రోజుల్లోనే ఓటీటీలోకి తీసుకొచ్చారు.
రత్నం మూవీని మే 23 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో స్ట్రీమింగ్ చేసింది. ఆమెజాన్ ప్రైమ్ వీడియోలోనే తమిళ వెర్షన్ తోపాటు తెలుగు వెర్షన్ కూడా స్ట్రీమింగ్ కు రానుండటం విశేషం..విశాల్, హరి కాంబినేషన్ లో వచ్చిన ఈ యాక్షన్ మూవీకి దేవి శ్రీప్రసాద్ మ్యూజిక్ అందించాడు. క్యూట్ బ్యూటీ ప్రియా భవాని శంకర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. అలాగే ఈ సినిమాలో సముద్రఖని, గౌతమ్ మేనన్, యోగి బాబు, మురళీ శర్మ కూడా నటించారు. రత్నం మూవీ థియేటర్లలో మూడు వారాల్లో రూ.17.87 కోట్లు వసూలు చేసింది.ఈ సినిమా అంతా ప్రియా భవాని శంకర్ నటించిన మల్లిక అనే పాత్ర చుట్టూ తిరుగుతుంది.. తన కి వచ్చే కష్టాలు రత్నం ఏ విధంగా తీరుస్తాడు..రత్నంకి, మల్లిక కి వున్న సంబంధం ఏంటి అనేది ఈ సినిమా కథ..యాక్షన్ సన్నివేశాలు బాగున్నా కథ కాస్త మిస్ ఫైర్ అవ్వడంతో ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది.