12వ రోజు పడిపోయిన పుష్ప.. అయినా సూపర్ ప్లేస్లో..?

Pulgam Srinivas
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా పుష్ప పార్ట్ 2 అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్గా నటించగా ... సుకుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ డిసెంబర్ 5 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్ షో లను డిసెంబర్ 4 వ తేదీ రాత్రి నుండి ప్రదర్శించడం మొదలు పెట్టారు. ఈ మూవీ కి ప్రీమియర్ షో ల ద్వారానే అద్భుతమైన టాక్ వచ్చింది. దానితో ఈ మూవీ కి విడుదల రోజు సూపర్ సాలిడ్ ఓపెనింగ్లు లభించాయి.

ఇప్పటికే ఈ సినిమా 1300 కోట్లకు పైగా కలెక్షన్లను ప్రపంచ వ్యాప్తంగా రాబట్టింది. ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన 12 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయింది. ఈ 12 రోజుల్లో ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్లను ప్రపంచ వ్యాప్తంగా వసూలు చేసింది. ఇకపోతే 12 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ కలెక్షన్లను వసూలు చేసిన సినిమాల లిస్టులో ఈ మూవీ మూడవ స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో ప్రభాస్ హీరో గా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బాహుబలి 2 సినిమా 5.49 కోట్ల కలెక్షన్లతో నిలవగా ,  రెండవ స్థానంలో రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ ఆర్ ఆర్ మూవీ 4.88 కోట్ల కలెక్షన్లతో నిలిచింది. పుష్ప పార్ట్ 2 మూవీ 3.07 కోట్ల కలెక్షన్లతో 3 వ స్థానంలో నిలిచింది.

ఇలా విడుదల అయిన 12 వ రోజు పుష్ప పార్ట్ 2 సినిమా తక్కువ వసూలు చేసిన 12 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక కలెక్షన్లను వసూలు చేసిన సినిమాలు లిస్టు లో 3 వ స్థానంలో నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Aa

సంబంధిత వార్తలు: