టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్లలో అనిల్ రావిపూడి కూడా ఒకరు. తీసేది కమర్షియల్ సినిమాలే కానీ ఎంటర్టైన్మెంట్ కి పెద్ద పీట వేసి తన సినిమాలతో ప్రేక్షకులను బాగా అలరించే సత్తా ఉన్న డైరెక్టర్ అనిల్ రావిపూడి.ఇదిలా ఉంటే ఈయన హీరోల విషయంలో తీసుకుంటున్న నిర్ణయాలు అభిమానులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి.అనిల్ సినిమాలకు దాదాపు 100 కోట్ల మార్కెట్ ఉంది..ఆయనకు కూడా అదిరిపోయే ఇమేజ్ వుంది..పాన్ ఇండియా సినిమాలు చేయగల సత్తా కూడా ఉంది..అయినా కూడా పాన్ ఇండియా మోజులో పడకుండా సినిమాలు చేసుకుంటూ సక్సెస్ అవుతున్నాడు అనిల్. పైగా మిగిలిన దర్శకులంతా స్టార్ హీరోల వెంటపడి పాన్ ఇండియా సినిమాలు చేస్తుంటే..ఈయన మాత్రం సీనియర్ హీరోల వెంట పడుతున్నాడు. దీనికి కూడా ఓ కారణం ఉంది. అనిల్ రావిపూడి అడగాలే కానీ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలు డేట్స్ ఇవ్వడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు.కాకపోతే మరో రెండు మూడేళ్ల వరకూ వాళ్లు వరుస సినిమాలకు కమిట్ అయ్యారు.
దాంతో ఇప్పుడు వాళ్ల కోసం కథలు రాసుకుంటూ కూర్చుంటే.. ఎదురుచూపులు తప్ప ఇంకేమీ ఉండవని అనిల్ రావిపూడికి తెలియనిది కాదు. కేవలం ఈ ఒక్క కారణంతో సీనియర్ హీరోలతో వరుస సినిమాలు చేస్తున్నాడు అనిల్.సీనియర్ హీరోలు అయితే కేవలం తెలుగు సినిమాలు మాత్రమే చేస్తున్నారు..పాన్ ఇండియా వైపు అడుగులు వేయడం లేదు. అందుకే అవకాశం వచ్చినప్పుడు మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలను పట్టుకుంటూ.. మిగిలిన సమయాల్లో సీనియర్ హీరోలతో సర్దుకుపోతున్నాడు అనిల్ రావిపూడి.
మహేష్ బాబు లాంటి హీరోతో సరిలేరు నీకెవ్వరు తీసి సూపర్ హిట్ అందుకున్న అనిల్, ఆ తర్వాత బాలయ్య తో భగవంత్ కేసరి చేసి సక్సెస్ అందుకున్నాడు.ఆ సినిమాలో బాలయ్యను సరికొత్తగా చూపించిన వైనం అందరినీ ఇంప్రెస్ చేసింది. ఇప్పటివరకు తన నుంచి వచ్చిన సినిమాలన్నీ మీడియం బడ్జెట్ లో వచ్చి భారీ లాభాలు అందుకున్నవే. అయితే ఇప్పుడు అనిల్ ఏకంగా మెగాస్టార్ చిరంజీవి తో సినిమా ఛాన్స్ కొట్టేశాడని టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే చిరూని కలిసి కథ చెప్పాడని, చిరూకి కథ నచ్చి ఫైనల్ నెరేషన్ తో రమ్మన్నాడని తెలుస్తోంది.ఇక ప్రస్తుతం అనిల్ అప్ కమింగ్ ప్రాజెక్టు సంక్రాంతికి వస్తున్నాం సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ సంక్రాంతికి వస్తున్నాం సినిమా రిలీజ్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి తో సినిమాకు సంబంధించిన అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశముంది.