చాలాకాలం తర్వాత మళ్లీ తెలుగు తెరపై కనిపించబోతున్న సోనాలి బింద్రే.. ఏ సినిమాలో అంటే..!?

Thota Jaya Madhuri
ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తూ ఉండటం మనం చూస్తున్నాం.  మరీ ముఖ్యంగా ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీని వెలసిన అందాల ముద్దుగుమ్మలు అందరూ కూడా ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడానికి ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అఫ్ కోర్స్ సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా సూపర్ డూపర్ సక్సెస్ అవుతున్నారు . రీసెంట్ గా కాజల్ అగర్వాల్ తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి ఏ విధంగా సక్సెస్ అయిందో అందరికీ తెలిసిందే. ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఎలాంటి మంచి పేరు సంపాదించుకుందో ..సెకండ్ ఇన్నింగ్స్ లోను అంతే మంచి పేరు సంపాదించుకుంది.

 
కాగా ఇప్పుడు మరొక హీరోయిన్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయబోతుంది అన్న వార్త తెలుగు ఇండస్ట్రీలో బాగా వైరల్ గా మారింది . సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అందాల ముద్దుగుమ్మ సోనాలి బింద్రే చాలా కాలం తర్వాత తెలుగు తెరపై కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి . అది కూడా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మూవీలో . బుచ్చిబాబు సనా దర్శకత్వంలో జాన్వి కపూర్ హీరోయిన్గా రామ్ చరణ్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతుంది .


ఈ సినిమా ప్రజెంట్ సెట్స్ పై ఉంది. ఈ సినిమాలో కీలకపాత్ర కోసం సోనాలి బింద్రేను చూస్ చేసుకున్నారట మేకర్స్ . చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ కావడంతో సోనాలి బింద్రే కూడా తన సెకండ్ ఇన్నింగ్స్ ఈ సినిమా ద్వారా స్టార్ట్ చేయడానికి ఓకే చేసిందట . చిరంజీవి సోనాలి బింద్రే కాంబినేషన్లో వచ్చిన "ఇంద్ర" సినిమా ఎంత సూపర్ డూపర్ హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు చిరంజీవి కొడుకు రాంచరణ్ తో నటించబోతూ ఉండటం.. ఇది నిజంగా సోనాలి బింద్రేకు మంచి కం బ్యాక్ అంటున్నారు మెగా అభిమానులు. చూడాలి మరి ఈ సినిమా ఆమెకి ఎలాంటి విజయం అందిస్తుందో..?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: