హెరాల్డ్ టాలీవుడ్ సూపర్ హిట్లు 2024: నా సామిరంగా అనిపించిన నాగార్జున!

MADDIBOINA AJAY KUMAR
కింగ్ నాగార్జున నటించిన నా సామి రంగ సినిమా టాలీవుడ్ లో హిట్ మూవీలలో ఒకటిగా నిలిచింది. ఈ సినిమాకు కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకత్వం వహించారు. ఈ మూవీ 2024 భారతీయ తెలుగు భాషా పీరియడ్ యాక్షన్ డ్రామా. ఈ మూవీని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మించారు. ఈ చిత్రం యొక్క సౌండ్‌ట్రాక్‌ను MM కీరవాణి స్వరపరిచారు.
ఈ సినిమాలో అక్కినేని నాగార్జున తో పాటు నటుడు అల్లరి నరేష్ , హీరో రాజ్ తరుణ్ , హెరోయిన్ లుగా ఆషికా రంగనాథ్ మరియు షబీర్ కల్లారక్కల్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఇక మిర్నా మీనన్ , రుక్సార్ ధిల్లాన్ మరియు నాసర్ సహాయక పాత్రలు పోషించారు. ఈ చిత్రం 14 జనవరి 2024న థియేటర్లలో రిలీజ్ అయ్యింది. మకర సంక్రాంతి సందర్భంగా విడుదలైన నా సామి రంగ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. నాగార్జున 'నా సామిరంగ' సినిమాకు నైజాంలో రూ. 5.00 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.20 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని మిగిలిన ప్రాంతాల్లో కలిపి రూ. 8.00 కోట్ల బిజినెస్ జరిగింది. ఇలా మొత్తంగా తెలుగులో రూ. 15.20 కోట్లకు అమ్ముడైంది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1 కోట్లకు, ఓవర్సీస్‌లో రూ. 2 కోట్లతో కలిపి మొత్తంగా దీనికి రూ. 18.20 కోట్లు బిజినెస్ జరిగింది. మంచి టాక్ తో సంక్రాంతికి వచ్చిన 'నా సామిరంగ' మూవీ భారీ హిట్ కొట్టింది. దీనికి ప్రారంభంలోనే పాజిటివ్ టాక్ రావడంతో పాటు రివ్యూలు కూడా మంచిగానే వచ్చాయి. దీనికి అనుగుణంగానే ఈ చిత్రానికి ప్రేక్షకుల స్పందన భారీ స్థాయిలో లభించింది. ఈ సినిమాతో నాగార్జున మరోసారి ప్రేక్షకల మనసులను దోచుకున్నారు.
ఈ సినిమా లో నాగార్జున చాలా బాగా నటించారు. నా సామి రంగ మూవీ తెలుగు ప్రేక్షకులకు కావాల్సిన లవ్‌, కామెడీ, యాక్షన్‌, ఎమోషన్‌ ఇచ్చింది. కథలో ఎలాంటి కొత్తదనం లేకపోయినా అల్లరి నరేష్, రాజ్ తరుణ్ వారి నటనతో ప్రేక్షకులను సినిమా మొత్తం ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నారు. కొన్ని చోట్ల నవ్విస్తూ.. మరికొన్ని చోట్ల ఏడిపించారు. యాక్షన్‌ తో పాటు ఎమోషనల్‌ సన్నివేశాలను కూడా చక్కగా తెరకెక్కించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: