ప్రభాస్ కు గాయాలు..ఆందోళనలో ఫ్యాన్స్.!

FARMANULLA SHAIK
రెబల్ స్టార్ ప్రభాస్  లైనప్ చేసిన సినిమాలు చూస్తే బుర్రపెలిపోతుంది. ఇదికదా రెబల్ స్టార్ రేంజ్ అంటూ ఫ్యాన్స్ తెగ పొంగిపోతున్నారు. సలార్ సినిమాతో దాదాపు ఆరేళ్ళ తర్వాత సక్సెస్ ట్రాక్ లోకి వచ్చిన ప్రభాస్.. ఆ వెంటనే కల్కి సినిమాతో భారీ హిట్ అందుకున్నారు. కల్కి దెబ్బకు బాక్సాఫీస్ షేక్ అయ్యింది. ఏకంగా ఈ సినిమా వెయ్యి కోట్లకు పైగా వసూల్ చేసింది. ఇక ఇప్పుడు రాజా సాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు ప్రభాస్. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా నుంచి ఇప్పటివే విడుదలైన ప్రభాస్ లుక్స్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించాయి. ఈసినిమాలతో పాటు సలార్ 2, కల్కి  2, హను రాఘవపూడి సినిమా, సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ మూవీఇలా వరుసగా సినిమాలను లైన్ లో పెట్టాడు మన డార్లింగ్.ప్రస్తుతం ప్రభాస్ ఆయ సినిమాల షూటింగ్స్ లో తెగ బిజీగా మారిపోయాడు. ఈ క్రమంలోనే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఓ సినిమా షూటింగ్ లో గాయపడ్డారు. జపాన్ లో వచ్చే నెల 4వ తేదీన రిలీజ్ అయ్యే కల్కి ప్రమోషన్లకు తాను హాజరవ్వట్లేదని ప్రభాస్ వెల్లడించారు. ఓ సినిమా షూటింగ్ చిత్రీకరణలో భాగంగా తన చిలమండలం బెనికిందని, అందుకే వెళ్ళలేకపోతున్నానని ఆయన ప్రకటించారు డిస్ట్రిబ్యూటర్ల టీం ప్రమోషన్స్ లో పాల్గొంటుందని తెలిపారు దీంతో ప్రభాస్ త్వరగా కోలుకోవాలని ఫాన్స్ పోస్ట్ చేస్తున్నారు.ఇదిలావుండగా ప్రభాస్‌తో సందీప్ వంగ తీయబోతున్న సినిమా కోసం ఫ్యాన్స్‌ మాత్రమే కాకుండా ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. యానిమల్‌ సినిమా దాదాపుగా రూ.1000 కోట్ల వసూళ్లు సొంతం చేసుకుంది. కనుక సందీప్ తదుపరి సినిమాపై హిందీ ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. ప్రభాస్ సలార్‌, కల్కి సినిమాలతో పాన్ ఇండియా స్థాయిలో భారీ విజయాలను సొంతం చేసుకున్నాడు. కనుక రాజాసాబ్‌, ఫౌజీ, స్పిరిట్‌ సినిమాలు మరో మూడు భారీ విజయాలను ప్రభాస్‌కి కట్టబెట్టే అవకాశాలు ఉన్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: