స్టార్ హీరోయిన్ మహానటి కీర్తి సురేష్ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. తన చిన్ననాటి బాయ్ ఫ్రెండ్ ఆంటోని తట్టిల్ ను వివాహం చేసుకుంది. దాదాపు 15 సంవత్సరాలో పాటు ప్రేమించుకున్న ఈ జంట వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. గోవాలో డిసెంబర్ 12న జరిగిన ఈ వివాహ వేడుకకు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరు అయ్యారు. కాగా, కీర్తి సురేష్, ఆంటోనీ వివాహం హిందూ సాంప్రదాయ పద్ధతిలో జరిగింది.
వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన సినీ ప్రముఖులు, నెటిజన్లు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో కీర్తి సురేష్ పెళ్లి ఫోటోలు ట్రెండింగ్ లో ఉన్నాయి. తాజాగా కీర్తి సురేష్, ఆంటోనీ తట్టిల్ క్రిస్టియన్ సాంప్రదాయ పద్ధతిలో కూడా వివాహం చేసుకున్నారు. ఈ ఫోటోలను కీర్తి సురేష్ సోషల్ మీడియాలో అభిమానులతో షేర్ చేసుకుంది.
ఈ ఫోటోలు కూడా హాట్ టాపిక్ అవుతున్నాయి. కాగా, కీర్తి సురేష్ పెళ్లి చీర గురించి ఓ ఆసక్తికర విషయం తెలుగులోకి వచ్చింది. కీర్తి సురేష్ తన పెళ్లి చీరను ప్రత్యేకంగా డిజైన్ చేయించుకుందని సమాచారం. కాంచీపురంలో నేసిన కీర్తి సురేష్ పట్టు చీరలో మేలిమి బంగారు లేసులను వాడినట్లుగా చెబుతున్నారు. ఈ బంగారు లేసులను ఉపయోగించి దాదాపు 405 గంటల పాటు ఈ చీరను నేసారట. అందుకు తగినట్లుగానే ఈ చీర అత్యంత ఖరీదు పెట్టి కీర్తి సురేష్ డిజైన్ చేయించుకుందట. కీర్తి సురేష్ చీర ప్రస్తుతం అందరినీ ఆకట్టుకుంటుంది.
కీర్తి సురేష్ మాత్రమే కాకుండా తన భర్త ఆంటోనీ ధరించిన పట్టు వస్త్రం, అంగవస్త్రంను సైతం ప్రత్యేకంగా తయారు చేశారట. అందుకుగాను 150 గంటల సమయం పట్టిందట. ఆంటోని వస్త్రాలకు కూడా బంగారు లేసులను ఉపయోగించి స్పెషల్ గా తయారు చేయించారట. వీరిద్దరికి సంబంధించిన పెళ్లి బట్టలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.