అల్లు అర్జున్ గ్రేట్‌... శ్రీతేజ్ కోసం సింగపూర్ నుంచి ఇంజెక్షన్!

Veldandi Saikiran
పుష్ప-2 బెనిఫిట్ షో హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ వద్ద జరిగింది. అక్కడికి అల్లు అర్జున్ రావడంతో పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు. దీంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందారు. అంతేకాకుండా తన కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. ఈ విషాద ఘటన అల్లు అర్జున్ కు తెలిసిన వెంటనే రేవతి కుటుంబానికి 25 లక్షలు ఆర్థిక సాయం అందించారు.

కానీ రేవతి కుమారుడు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ బాలుడిని అల్లు అర్జున్ ఇంతవరకు కలవలేదని విమర్శలు వస్తున్నాయి. దీనిపై అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. కేసు విచారణ జరుగుతున్నందువల్ల నేను శ్రీతేజ్ ను కలవలేక పోతున్నానని చెప్పాడు. బాలుడు శ్రీతేజ్ పరిస్థితి పట్ల ఎంతో బాధపడుతున్నానని దురదృష్టకర ఘటనలో గాయపడిన ఆ చిన్నారి ఇప్పటివరకు ఆసుపత్రిలోనే ఉండడం నన్ను ఎంతో వేదనకు గురి చేస్తుందని అల్లు అర్జున్ పేర్కొన్నారు. అతనికి ఎంతైనా సాయం చేస్తానని అనౌన్స్ చేశాడు.

ఇటీవలే వైద్య చికిత్సలో భాగంగా శ్రీతేజ్ కు అత్యవసరమైన ఇంజక్షన్ కావలసి వచ్చిందని సమాచారం. దీనిని సింగపూర్ నుంచి తెప్పించి చికిత్సలో ఎలాంటి ఆటంకాలు రాకుండా అల్లు అర్జున్ చూసుకున్నారు. దీంతో అల్లు అర్జున్ పట్ల అభిమానులు ఇండస్ట్రీవర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సింగపూర్ నుంచి ఇంజక్షన్ తెప్పించడం ఒక పక్క ఖరీదైన వ్యవహారం అయినప్పటికీ వారి ప్రాణానికి విలువను ఇస్తూ ఎంతటి ఖర్చుకు భయపడకుండా అల్లు అర్జున్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
అల్లు అర్జున్ తన తరఫున 25 లక్షల రూపాయలను ప్రకటించి ఎల్లప్పుడూ శ్రీతేజ్ కుటుంబానికి అండగా ఉంటానని వెల్లడించాడు. హాస్పిటల్ ఖర్చులు మాత్రమే కాకుండా భవిష్యత్తులో ఎలాంటి అవసరం వచ్చిన తాను ఎప్పుడు అండగా ఉంటానని అల్లు అర్జున్ హామీ ఇచ్చారు. ఈ ఆర్థిక సహాయం వలన శ్రీతేజ్ కుటుంబానికి కొంత ఊరట లభిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: