నిఖిల్ కావ్య లవ్ స్టోరీలో సినిమాకు మించిన ట్విస్టులు.. మళ్ళీ కలుస్తారా?

MADDIBOINA AJAY KUMAR
సెప్టెంబర్ 1వ తేదీన మొదలైన బిగ్ బాస్ సీజన్ 8 నిన్నటితో ముగిసింది. ఈ సీజన్ లో నటుడు నిఖిల్ మాలియక్కల్ గెలిచాడు. నిఖిల్ కన్నడ లోని మైసూర్ లో జన్మించారు. ఆయన తండ్రి జర్నలిస్టు, తల్లి నటి కావడంతో చిన్నప్పటి నుండే నిఖిల్ కి డాన్స్, సినిమాలపై ఆసక్తి మొదలైంది. 2016 లో ఊటి సినిమా ద్వారా కన్నడ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ఆయన స్టార్ మా లో ప్రసారం అయ్యే గోరింటాకు సీరియల్ ద్వారా తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టి అందరి మనసు దోచుకున్నాడు. ఆయన నటనతో తెలుగు వారిని కూడా ఎంతగానో ఆకట్టుకున్నాడు.
అంతేకాదు నిఖిల్ స్టార్ మాలో ప్రసారమయ్యే ప్రతి షోలో పాల్గొనేవాడు. ఇక బిగ్ బాస్ సీజన్ 8లో ఆఫర్ రావడంతో మొదటి కంటెస్టెంట్ గా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టాడు. తన మాట, ఆటతో ప్రేక్షకులను తన వైపుకు తిప్పుకున్నాడు. నిఖిల్ కి మాత్రమే సీజన్ 8 విన్నర్ అయ్యే అర్హత ఉందని ప్రేక్షకుల అందరి నోట అనిపించుకున్నాడు. ఈ సీజన్ లో 22 మంది దాటుకొని 105 రోజులు బిగ్ బాస్ హౌస్ లో జర్నీ చేసి గెలిచాడు. రూ. 55 లక్షల ప్రైజ్ మనీతో పాటు మారుతీ లగ్జరీ కారుని కూడా బహుమతిగా పొందాడు.
ఇక పోతే నిఖిల్ లవ్ లైఫ్ కి వస్తే.. నిఖిల్ హీరోగా నటించిన గోరింటాకు సీరియల్ లో హీరోయిన్ రోల్ చేసిన కావ్య శ్రీతో రిలేషన్షిప్లో  ఉన్నారు. అయితే నిఖిల్ బిగ్ బాస్ కి వెళ్ళే ముందు వారికి గొడవ అయిందని సమాచారం. నిఖిల్ బిగ్ బాస్ కి వెళ్లక అక్కడ సోనియాతో క్లోస్ గా ఉన్నట్లు, యాస్మితో లవ్ ట్రాక్ నడిపినట్లు కనిపించింది. చివర్లో బయట నాకు వేరే ఉన్నారని.. బ్రేకప్ అయిందని నిఖిల్ అన్నారు. బిగ్ బాస్ నుండి బయటికి వెళ్లిన తర్వాత తనని కలుస్తానని, తనపై ఉన్న ప్రేమని మళ్లీ వ్యక్తపరుస్తానని ఎమోషనల్ అయ్యాడు. నిఖిల్ తన లవ్ స్టోరి షేర్ చేసుకున్న వెంటనే.. కావ్య శ్రీ తన ఇన్స్టాలో ఫేక్ పీపుల్ అంటూ పెట్టిన స్టోరి సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఇన్ని ట్విస్టుల తర్వాత ఇప్పుడు నిఖిల్, కావ్య మళ్లీ కలుస్తారా, లేదా అని ఫాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చాలా మంది అభిమనులు వారిద్దరూ కలవాలని కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: