పుష్ప 2 : బ్రేక్ ఈవెన్ కంప్లైంట్.. 11 రోజుల్లోనే ఊచకోత..?

Pulgam Srinivas
అల్లు అర్జున్ , రష్మిక మందన జంటగా సుకుమార్ దర్శకత్వంలో కొన్ని సంవత్సరాల క్రితం పుష్ప పార్ట్ 1 అనే సినిమా రూపొందిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా భారీ బ్లాక్ బాస్టర్ విజయం అందుకుంది. దానితో ఈ సినిమాకు కొనసాగింపుగా పుష్ప పార్ట్ 2 అనే సినిమాను రూపొందించారు. ఇక ఈ సినిమాను డిసెంబర్ 5 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేశారు. డిసెంబర్ 4 వ తేదీన రాత్రి నుండే ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్ షో లను ప్రదర్శించడం మొదలు పెట్టారు. ఈ మూవీ కి ప్రీమియర్ షో ల ద్వారానే అద్భుతమైన టాక్ రావడంతో డిసెంబర్ 5 వ తేదీన ఈ మూవీ కి అద్భుతమైన ఓపెనింగ్స్ లభించాయి.

ఇక ఈ మూవీ కి సూపర్ సాలిడ్ టాక్ రావడంతో ఈ మూవీ కి అద్భుతమైన కలెక్షన్లు వస్తూనే ఉన్నాయి. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 617 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దానితో ఈ మూవీ 620 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలోకి దిగింది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకొని విజయాన్ని సాధించాలి అంటే ప్రపంచ వ్యాప్తంగా 1200 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను సాధిస్తేనే ఈ మూవీ బ్రేక్ ఫార్ములాను కంప్లీట్ చేసుకోవలసి ఉంటుంది. ఇకపోతే ఈ మూవీ 11 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

నిన్నటితో ఈ సినిమా 620 కోట్లకి మించిన షేర్ కలెక్షన్లను వసూలు చేసినట్లు దానితో నిన్నటితో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమా ఇప్పటికే బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుంది కాబట్టి రాబోయే రోజుల్లో ఈ సినిమా వసూలు చేసే కలెక్షన్లు అన్ని కూడా లాభాల కిందకే వస్తాయి. మరి ఈ మూవీ టోటల్ బాక్సాఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఎన్ని కోట్ల లాభాలను అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

Aa

సంబంధిత వార్తలు: