మోహన్ బాబు మొదటి భార్య చనిపోవడానికి అసలు కారణం అదే.?

FARMANULLA SHAIK
కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు పై ఇప్పుడంటే ట్రోల్స్ వస్తున్నాయి కానీ టాలీవుడ్ లో ఆయన కూడా గొప్ప నటుడు అనే సంగతి ఒప్పుకోవాల్సిందే. పెదరాయుడు సినిమా తో పాటు మోహన్ బాబు కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. హీరోగా విలన్ గా మోహన్ బాబు నటవిశ్వరూపాన్ని చూపించారు.అయితే ఆయన కొన్ని సార్లు నోరు జారడం వల్లనే ఈ ట్రోల్స్ వస్తున్నాయని నెటిజన్లు అభిప్రాయపడుతుంటారు. ఇదిలా ఉంటే మోహన్ బాబు జీవితంలో ఎవరికీ తెలియని కొన్ని విషయాలు కూడా ఉన్నాయి. మోహన్ బాబు మొదట విద్యాదేవిని వివాహం చేసుకున్నారు. వీరిద్దరి సంతానమే మంచు లక్ష్మి, మనోజ్. మోహన్ బాబు విద్యా దేవీ ఎంతో అన్యోన్యంగా ఉండేవారట.అయితే కెరీర్ ప్రారంభంలో మోహన్ బాబుకు సరిగా అవకాశాలు లేనప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా విద్యాదేవి ఎంతో ధైర్యం చెప్పే వారట. ఓసారి మోహన్ బాబు ఇంటి అద్దె కట్టటం ఆలస్యం కావడంతో ఆ ఇంటి యజమాని వారు వంట వండుకునే పాత్రల్లో మూత్ర విసర్జన చేశాడట. ఈ విషయాన్ని మోహన్ బాబు స్వయంగా చెప్పారు.
దీంతో మోహన్ బాబు జీవితంలో ఎదగాలంటే మరింతగా కష్టపడాలని ఎక్కువ సినిమాల్లో నటించే వారట.  కానీ మోహన్ బాబు సినిమాల్లో బిజీ అవ్వడం వల్ల సమయానికి ఇంటికి వచ్చేవారు కాదట. దాంతో ఇద్దరి మద్య గొడవలు జరిగాయట. కాగా చిన్న గొడవల కారణంగా క్షణికావేశంలో విద్యా దేవి బలవన్మరణానికి పాల్పడ్డారని చెబుతుంటారు. అనంతరం మోహన్ బాబు విద్యా దేవి సోదరినే రెండో వివాహం చేసుకున్నారు. వీరిద్దరికీ మనోజ్ జన్మించాడు. ఇక మోహన్ బాబు తన విద్యా సంస్థలకు మొదటి భార్య పేరునే పెట్టారు.ప్రస్తుతం నిర్మాతగా, విద్యాసంస్థల డైరెక్టర్ గా మరియు నటుడిగా కొనసాగుతున్నారు. మరో వైపు మోహన్ బాబు అసలు పేరు కూడా ఎవరికీ తెలియదు. మోహన్ బాబు అసలు పేరు భక్త వత్సలం నాయుడు కాగా ఆయనకు దివంగత దర్శక నిర్మాత దాసరి నారాయణ రావు స్క్రీన్ నేమ్ గా మోహన్ బాబు అని నామకరణం చేశారు. ఇక అదే పేరుతో మోహన్ బాబు పాపులర్ అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: