ఒకప్పుడు స్టార్ హీరోయిన్.. ఇప్పుడేమో కరువైన అవకాశాలు..?

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ కలిగిన హీరోయిన్గా చాలా సంవత్సరాల పాటు కెరియర్ను కొనసాగించిన వారిలో మీరా జాస్మిన్ ఒకరు. ఈ ముద్దుగుమ్మ తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన తక్కువ కాలంలోనే అద్భుతమైన విజయవంతమైన సినిమాలలో నటించింది. దానితో ఈమెకు టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు దక్కడం మొదలు అయింది. అందులో భాగంగా ఈమె బాలకృష్ణ , రవితేజ వంటి స్టార్ హీరోల సినిమాలలో హీరోయిన్గా నటించింది. ఇకపోతే రవితేజ హీరో గా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన భద్ర సినిమా ద్వారా ఈమెకు అద్భుతమైన గుర్తింపు లభించింది.

ఈ సినిమా సూపర్ సక్సెస్ కావడం , అలాగే ఇందులో ఈమె తన నటనతో ప్రేక్షకులను ఎంత గానో ఆకట్టుకోవడంతో ఈ సినిమా ద్వారా ఈమెకు సూపర్ సాలిడ్ క్రేజ్ వచ్చింది. ఇకపోతే ఈ మధ్యకాలంలో ఈ బ్యూటీ కి సరైన అవకాశాలు దక్కడం లేదు. కొంత కాలం ఈమె సినిమాలకు దూరంగా ఉంది. మళ్లీ సినిమాల్లో నటించడానికి రెడీ అయింది. కానీ క్రేజీ సినిమాల్లో ఈమెకు అవకాశాలు దక్కడం లేదు. కొంత కాలం క్రితం శ్రీ విష్ణు హీరోగా రూపొందిన స్వాగ్ సినిమాలో ఈ ముద్దుగుమ్మ ఓ పాత్రలో నటించింది. ఈ ముద్దు గుమ్మ పాత్ర నిడివి ఈ సినిమాలో తక్కువే అయినప్పటికీ అందులో ఈమె తన నటనతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.

కానీ ఈ సినిమా మాత్రం మంచి విజయాన్ని అందుకోలేదు. ఇది ఇలా ఉంటే ఈ మధ్య కాలంలో ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది. ఆ ఫోటోలలో ఎక్కువ శాతం సూపర్ గా వైరల్ అయ్యాయి. ఇలా మీరా జాస్మిన్ సినిమాల ద్వారా కంటే కూడా ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: