యూట్యూబ్ లో నిఖిల్.. ఇన్స్టాలో గౌతమ్.. అసలు బిగ్ బాస్ విన్నర్ ఎవరు?
మరీ ముఖ్యంగా గౌతమ్ గురించి ఇక్కడ ప్రస్తావించాలి. పూర్తిగా గేమ్ చేంజర్ అయిపోయాడు. మొదటి వారంలోనే ఎలిమినేట్ అవ్వాల్సిన గౌతమ్, టైటిల్ విన్నింగ్ రేస్ లోకి రావడం సామాన్యమైన విషయం కాదు. గౌతమ్ ఆట తీరు ఈరోజు తనని బిగ్ బాస్ హౌస్ లో ఉన్నట్టు చేసింది. ఇక మీడియాలో జరిగే అత్యధిక పోలింగ్స్ లో గౌతమ్ నెంబర్ 1 స్థానంలో ఉన్నట్టు సర్వేలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే యూట్యూబ్ పోలింగ్స్ ని చాలా వరకు నమ్మొచ్చు అని విశ్లేషకులు చెబుతున్నారు. ఆడియన్స్ పల్స్ తెలుసుకోవడానికి యూట్యూబ్ పోల్స్ శాంపిల్స్ సరిపోతాయని వారు అంటున్నారు. ఎందుకంటే దేశం లో అత్యధిక శాతం మంది యూట్యూబ్ ని వాడుతుంటారు కాబట్టి.
అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమంటే... నిఖిల్ గౌతమ్ మీద ఊహించని రేంజ్ మార్జిన్ తో నెంబర్ 1 స్థానంలో ఇన్స్టాగ్రామ్ లో కొనసాగుతుండడం కొసమెరుపు. అవును, ఇన్స్టాలో నిర్వహిస్తున్న పోల్స్ ని చూస్తుంటే గౌతమ్ నిఖిల్ మీద అదే స్థాయి భారీ మార్జిన్ తో నెంబర్ 1 స్థానం లో ఉన్నాడు. మరోవైపు ట్విట్టర్ మరియు వెబ్ సైట్ పోల్స్ లో నిఖిల్ కనీవినీ ఎరుగని రేంజ్ తేడాతో లీడింగ్ లో కొనసాగుతూ ఉన్నాడు. దాంతోనే గౌతమ్ అభిమానులు అయోమయంలో పడిపోయారు. ఇక సాధారణ ప్రేక్షకుల సంగతి చెప్పాల్సిన అవసరం లేదు. వీటిల్లో ఏది నమ్మాలి? దేనిని నమ్మకూడదు! అనే విషయం అనేది ఇపుడు ఆడియన్స్ కి అర్థం కావడం లేదు.