నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా నటించింది. ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. బాలకృష్ణ ఈ మూవీ లో రెండు పాత్రలలో నటించాడు. ఒక పాత్రలో అఘోరా గానూ , మరొక పాత్రలో రైతుగానూ నటించి రెండు పాత్రలలోనూ తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఇకపోతే ఈ సినిమా కంటే ముందు బాలకృష్ణ వరుస అపజయాలను ఎదుర్కొన్నాడు. అలా వరుస అపజాలతో డీలా పడిపోయి ఉన్నా బాలయ్య ఈ సినిమాతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నాడు.
ఈ మూవీ 2021 వ సంవత్సరం డిసెంబర్ నెలలో భారీ అంచనాల నడమ విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సాలిడ్ విజయాన్ని అందుకుంది. ఇకపోతే అఖండ మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో అఖండ సినిమాకు కొనసాగింపుగా అఖండ 2 అనే మూవీ ని రూపొందించబోతున్నట్లు ఈ మూవీ బృందం వారు చాలా రోజుల క్రితమే ప్రకటించారు. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. తాజాగా అఖండ 2 మూవీ ని వచ్చే సంవత్సరం సెప్టెంబర్ 25 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ మూవీ పై హిందీ ప్రేక్షకుల్లో భారీ క్రేజ్ ఉన్నట్లు తెలుస్తోంది.
దానితో A2 ఎంటర్టైన్మెంట్ సంస్థ ఈ సినిమా యొక్క హిందీ హక్కులను ఏకంగా 40 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసినట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇక ఈ సినిమా యొక్క నార్త్ హక్కులు 40 కోట్లకు అమ్ముడు పోయినట్లయితే ఈ సినిమా దాదాపు 80 కోట్ల షేర్ కలెక్షన్లను వసూలు చేస్తే బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుని అవకాశాలు ఉంటాయి. అలా జరగాలి అంటే ఈ మూవీ కి బ్లాక్ బాస్టర్ రావాల్సిందే అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు.