పాపం మోహన్ బాబు... ఈ వ‌య‌స్సులో ఈ బాధ‌లు ఎందుకు... !

RAMAKRISHNA S.S.
- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . .

టాలీవుడ్‌లో క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబు పేరు అంటేనే ఎంతో క్ర‌మ‌శిక్షణ .. క్ర‌మ‌శిక్ష‌ణ కు మోహ‌న్ బాబు కేరాఫ్‌. అలాంటి మోహ‌న్ బాబు ఇప్పుడు కుమారుల ఎఫెక్ట్ తో ఈ వ‌య‌స్సులో ఎంతో మ‌నో వేద‌న ప‌డుతున్నారు. వందల కోట్లు ఆస్తి సంపాదించి అల్లారు ముద్దుగా బిడ్డలను పెంచుకుని ప్రస్తుతం సన్ స్ట్రోక్ తో అల్లాడిపోతున్నార‌నే చెప్పాలి. ఇక్క‌డ త‌ప్పు ఎవ‌రిది ? అన్న‌ది త‌ర్వాత విష‌యం. అయితే కొడుకులు రోడ్డుకు ఎక్కారంటే ఆయ‌న కు ఎంతో బాధ ఉంటుంది. ఫ్యామిలీ గొడవల్లో మోహన్ బాబు ఆడియో విన్నాను,అందులో మోహన్ బాబు ఆవేదన తప్ప  ఆవేశం కనపడలేదు. అల్లారు ముద్దుగా పెంచుకున్న తన చిన్న కొడుకు మనోజ్ తన పరువును బజారున వేశాడన్న ఆవేదన ఆయ‌న‌లో ఉంది.

అయితే మ‌నోజ్ వెర్ష‌న్ ఆయ‌న‌కు ఉంది. మోహన్ బాబు బయటి వారిపై ఎంత ఆవేశంగా ప్రవర్తించినా సొంత కుటుంబ పట్ల ఎంత మామకారంగా ఉంటాడో చాలా సందర్భాలలో చూశాం. ఇక మీడియా ప్రతినిధి పై దాడి విషయం,ఇది అత్యంత సున్నితమైన ఫ్యామిలీ మ్యాటర్ ఇందులో పరిమితికి మించి మైకులు పెట్టి రంద్రాన్వేషణ చేయాలనే దుగ్ధ వల్ల జరిగిన పరిమాణం మాత్రమే అని చెప్పాలి. మీడియా అయినంత మాత్రాన అన్నిటిలో దూరతాం అంటే మోహన్ బాబు లాంటి వాళ్ళు అంతే వైల్డ్ గా రియాక్ట్ అవుతారు కూడా... మీడియా కూడా తమ పరిధి మించి ఎక్కడా పర్సనల్ విషయాల్లో కలిగించుకోకూడదు. కాదు కలిగించుకుంటాం అంటే ఇలాటి పరిణామాలే ఫేస్ చేయాల్సి ఉంటుంద‌ని చెప్పే వాళ్లు కూడా ఉన్నారు. ఏదేమైనా న‌టుడి గా 50 ఏళ్లు పూర్తి చేసుకో బోతోన్న త‌రుణం లో మోహ‌న్‌బాబు ఇంట్లో ఈ ప‌రిణామాలు ఆయ‌న‌కు మాయ‌ని మ‌చ్చ లాంటివే..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: