ఒక్క గంటలో బుక్ మై షో ఆప్ లో అత్యధిక టికెట్లు అమ్ముడుపోయిన టాప్ 5 ఇండియన్ సినిమాలు ఏవి అనే వివరాలను తెలుసుకుందాం.
పుష్ప పార్ట్ 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన హీరోయిన్గా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా డిసెంబర్ 5 వ తేదీన విడుదల చేసిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ ను తెచ్చుకొని ఇప్పటికే 1000 కోట్లకు పైగా కలెక్షన్లను ప్రపంచవ్యాప్తంగా కొల్లగొట్టింది. పుష్ప 2 సినిమా విడుదల రోజున బుక్ మై షో యాప్‌లో ఒక్క గంటలో అత్యధికంగా టికెట్స్ అమ్ముడు పోయిన మొదటి చిత్రంగా నిలిచింది. ఒక్క గంటలో బుక్ మై షో లో ఈ సినిమాకు సంబంధించిన 101.43K టికెట్స్ అమ్ముడుపోయాయి. దానితో ఒక్క గంటలో అత్యధిక టికెట్లు అమ్ముడుపోయిన సినిమాల లిస్టులో ఈ మూవీ మొదటి స్థానంలో నిలిచింది.
కల్కి 2898 AD : ప్రభాస్ హీరోగా దిశ పటాని హీరోయిన్గా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ టికెట్స్ బుక్ మై షో లో ఒక్క గంటలో 96 కే అమ్ముడుపోయాయి. దానితో ఈ సినిమా రెండవ స్థానంలో నిలిచింది.
జవాన్ : షారుక్ ఖాన్ హీరోగా నయనతార , దీపికా పదుకొనే హీరోయిన్లు దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ టికెట్స్ బుక్ మై షోలో ఒక్క గంటలో 86 వేలు అమ్ముడుపోయాయి. దానితో ఈ సినిమా మూడవ స్థానంలో నిలిచింది.
లియో : తలపతి విజయ్ హీరోగా త్రిష హీరోయిన్ గా లోకేష్ కనకరాజు దర్శకత్వంలో రూపొందిన లియో సినిమాకు బుక్ మై షోలో ఒక్క గంటలో 83 వేల టికెట్స్ అమ్ముడుపోయాయి. దానితో ఈ సినిమా నాలుగవ స్థానంలో నిలిచింది.
యానిమల్ : రన్బీర్ కపూర్ హీరోగా రష్మిక మందన హీరోయిన్గా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రూపొందిన మూవీ బుక్ మై షోలో గంటలో 80 వేల టికెట్స్ అమ్ముడు పోయాయి. దానితో ఈ సినిమా ఐదవ స్థానంలో నిలిచింది.