నాగచైతన్య సమంత శోభిత ధూళిపాళ్లని కాకుండా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఎంతో బాగుండు అని ఈ వీడియో చూసిన ఎంతో మంది అక్కినేని అభిమానులు నాగచైతన్య కి సలహాలు,సూచనలు ఇస్తున్నారు.అయితే నాగచైతన్య బ్యాడ్ లక్ ఎందుకంటే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోరు కాబట్టి.. మరి ఇంతకీ ఏ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నాగచైతన్య లైఫ్ బాగుంటుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయో ఇప్పుడు చూద్దాం.నాగచైతన్య రీసెంట్ గానే శోభిత ధూళిపాళ్లతో పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. అయితే పెళ్లి జరగడంతోనే మళ్ళీ సినిమా షూట్ లో బిజీ అయిపోయారు.అయితే రీసెంట్ గా నాగచైతన్య పెళ్లికి ముందు రానా హోస్టుగా చేస్తున్న ఓ టాక్ షో కి గెస్ట్ గా వెళ్లిన సంగతి మనకు తెలిసిందే.అయితే ఈ షోలో రానా భార్య మిహికా బజాజ్ తో పాటు సురేష్ బాబు కూతురు రానా సోదరి మాళవిక, సుమంత్ ఇలా అక్కినేని దగ్గుబాటి ఫ్యామిలీకి చెందిన కొంతమంది సెలబ్రిటీలు వచ్చారు.
అయితే ఈ టాక్ షోలో పదేపదే బావ బావా అంటూ ఒక అమ్మాయి చైతన్యను నోరారా ప్రేమతో పిలిచింది. అయితే ఈ బావ అనే పిలుపుతో ఎంతో మంది అక్కినేని ఫ్యాన్స్ నాగచైతన్య ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఎంత బాగుండో అంటూ కలలు కంటున్నారు. ఇక ఆ అమ్మాయి ఎవరయ్యా అంటే సురేష్ బాబు కూతురు రానా సోదరి మాళవిక.. అయితే ప్రస్తుతం రానా సోదరి మాళవిక రానా టాక్ షో లో నాగచైతన్యను పదేపదే బావ బావ అంటూ పిలిచింది. అయితే దానికి సంబంధించిన వీడియో ని కొంతమంది ఎడిట్ చేసి మరీ నాగచైతన్యను మాళవిక భావా అని పిలిచిన వీడియో పోస్ట్ చేస్తూ చాలా మంది నెటిజెన్స్ వీరిద్దరూ పెళ్లి చేసుకుంటే ఎంత బాగుండు అంటూ కామెంట్లు పెడుతున్నారు.
అంతే కాదు నాగచైతన్య ఫ్యామిలీలో ఉండే మంచి అమ్మాయిని పెళ్లి చేసుకోకుండా మిస్ అయ్యారు.సమంత శోభితను కాకుండా ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అక్కినేని దగ్గుబాటి ఫ్యామిలీల మధ్య మరింత బాండింగ్ ఏర్పడేది అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అయితే సురేష్ బాబు కూతురు మాల మాళవికకి ఇప్పటికే పెళ్ళై పిల్లలు కూడా ఉన్నారు అలాగే నాగచైతన్య కూడా రెండు పెళ్లిళ్లు అయ్యాయి. కానీ నాగచైతన్య మాళవికకు సంబంధించిన ఫోటోలు,వీడియోలు నెట్టింట వైరల్ చేస్తూ క్యూట్ జోడి బావ మరదల్ అంటూ అక్కినేని ఫ్యాన్స్ తెగ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు