జగన్‌ కు మరో షాక్‌... వైసీపీకి మాజీ మంత్రి గుడ్ బై....?

Veldandi Saikiran
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసిపి పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి మరో ఎదురు దెబ్బ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏపీ లోని మరో కీలక నేత, మాజీ మంత్రి వైసిపి పార్టీకి గుడ్ బై చెప్పేందుకు.. నిర్ణయం తీసుకున్నారట. వైసిపి పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్.....జగన్మోహన్ రెడ్డికి గుడ్ బై చెప్పబోతున్నారు. వైసిపి పార్టీ వీడెందుకు ఆయన సిద్ధమైనట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
పలు మీడియాలో కూడా... ఈ అంశం హాట్ టాపిక్ అయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసిపి పార్టీ ఓడిపోయిన తర్వాత మీడియా ముందుకు ఎప్పుడు రాలేదు అవంతి శ్రీనివాస్.  గత కొంతకాలంగా వైసీపీ పార్టీకి అంటి ముట్టనట్టుగా... ఉంటున్నారు మాజీ మంత్రి  అవంతి శ్రీనివాస్. 2019 ఎన్నికల్లో...  భీమిలి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు అవంతి శ్రీనివాస్. ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి కేబినెట్లో స్థానం కూడా సంపాదించుకున్నారు.
పర్యటక శాఖ మంత్రిగా కూడా పనిచేశారు అవంతి శ్రీనివాస్. అయితే మరోసారి మొన్న భీమిలి నుంచి బరిలో కి దిగారు అవంతి శ్రీనివాస్. కానీ గంట శ్రీనివాసరావు చేతిలో దారుణంగా ఓడిపోయారు  అవంతి శ్రీనివాస్.  దాదాపు 14 శాతం ఓట్లు తక్కువ రావడంతో ఓడిపోవడం జరిగింది. గతంలో... ఎంపీగా కూడా పనిచేసిన అనుభవం ఉన్న అవంతి శ్రీనివాస్... వైసిపి ఓడిపోయిన తర్వాత ఈ మధ్యకాలంలో రాజకీయాల్లో యాక్టివ్ గా కనిపించడం లేదు.
వైసిపి కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు. దీంతో అవంతి శ్రీనివాసరావు  జంపు అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.  ఆయన జనసేన పార్టీ టచ్ లోకి వెళ్లినట్లు చెబుతున్నారు. గతంలో... ప్రజారాజ్యం పార్టీ నుంచి ప్రాతినిధ్యం కూడా వహించారు. 2009 నుంచి 2012 వరకు ఆ పార్టీలో ఉన్నారు. అందుకే పవన్ కళ్యాణ్ కు దగ్గర అవుతున్నారని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: