పుష్ప 2: బన్నీ పరువు తీసిన సిద్ధార్థ్..వాళ్లు ఫ్యాన్స్‌ కాదు..బీహార్‌ బ్యాచ్‌ ?

Veldandi Saikiran

టాలీవుడ్‌ స్టార్‌ హీరో అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్లో ఎన్నో అంచనాల నడుమ పుష్ప-2 సినిమా విడుదలైంది. ఈ సినిమా కోసం అభిమానులు కొన్ని సంవత్సరాల నుంచి ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తీసిపోని విధంగా సుకుమార్ ఈ సినిమాను అద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ నటన అద్భుతంగా ఉందని ప్రేక్షకులు అంటున్నారు. రష్మిక మందన హీరోయిన్ గా చేసిన సంగతి తెలిసిందే.

శ్రీ లీల స్పెషల్ సాంగ్ లో అల్లు అర్జున్ సరసన చిందులు వేసింది. ఫహాద్ ఫాజిల్, సునీల్, జగపతిబాబు, అనసూయ, రావు రమేష్ వంటి వారు కీలక పాత్రలను పోషించారు. ప్రస్తుతం ఎక్కడా చూసిన పుష్ప-2 హవానే కొనసాగుతోంది. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదలైన కేవలం నాలుగు రోజుల సమయంలోనే రూ. 800 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి మొదటి వీకెండ్ ను దిగ్విజయంగా పూర్తి చేసుకుంది.

ఇప్పటికే పుష్ప-2 సినిమా చాలా ఏరియాలలో ఆర్ఆర్ఆర్, బాహుబలి సినిమా రికార్డులను క్రాస్ చేసింది. దాదాపు రూ. 450 కోట్ల భారీ బడ్జెట్ తో పుష్ప-2 సినిమాని movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. టీజర్, ట్రైలర్ తో భారీ హైప్ తెచ్చుకున్న పుష్ప-2 సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ భారీ ఎత్తున జరిగింది. థియేట్రికల్ నాన్ థియేట్రికల్ రైట్స్ కలిపి దాదాపు రూ. 1000 కోట్లకు పైగా బిజినెస్ చేసింది.

అయితే.. పుష్ప 2 సక్సెస్‌ గా రన్‌ అవుతున్న నేపథ్యంలో అల్లు అర్జున్ పరువు తీశాడు సిద్దార్థ్.. బీహార్ లో వచ్చిన జనం అంతా జిమిక్కు అంటూ కామెంట్స్‌ చేశారు. మన ఇండియా కల్చరే అది అన్నాడు సిద్ధార్థ్‌. ఓ ఇంటర్యూలో బీహార్ లో పుష్ప 2 ఈవెంట్‌ కు భారీ జనాలు వచ్చారని.. సిద్దార్థ్ ను యాంకర్ అడిగాడు.  దీంతో.. దారుణమైన కామెంట్స్‌ చేశాడు  సిద్దార్థ్. ఇండియాలో జేసీబీ వస్తే.. జనాలు గుమిగుడతారు... అచ్చం అలాగే.. పుష్ప 2 ఈవెంట్‌ కు కూడా బీహార్‌ బ్యాచ్‌ వచ్చిందన్నాడు  సిద్దార్థ్. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌ గా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: