బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు చేస్తున్న పుష్ప ది రూల్.. రూ.2000 కోట్ల కలెక్షన్లు పక్కా!

Reddy P Rajasekhar
అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన పుష్ప ది రూల్ మూవీ ప్రేక్షకులను అంచనాలను మించి మెప్పిస్తోంది. కలెక్షన్ల విషయంలో ఈ సినిమా అదరగొడుతోంది. మరో విధంగా చెప్పాలంటే బాక్సాఫీస్ వద్ద పుష్ప ది రూల్ మూవీ అద్భుతాలు చేస్తోంది. ఈ సినిమా ప్రస్తుతం సాధిస్తున్న కలెక్షన్లు చూస్తుంటే 2000 కోట్ల రూపాయల కలెక్షన్లు పక్కా అనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
 
పుష్ప ది రూల్ అంచనాలకు మించి సక్సెస్ సాధించిన నేపథ్యంలో పుష్ప ది ర్యాంపేజ్ పై కూడా అంచనాలు పెరుగుతున్నాయి. పుష్ప ది రూల్ మైత్రీ నిర్మాతలకు సైతం మంచి లాభాలను అందిస్తోంది. బన్నీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా ఈ సినిమా నిలవడంతో పాటు ప్రభాస్ ను మించిన క్రేజ్ బన్నీకి సొంతమవుతోందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
 
పుష్ప ది రూల్ రాబోయే రోజుల్లో సైతం కలెక్షన్ల విషయంలో ఇదే దూకుడును కొనసాగిస్తే మాత్రం ఈ సినిమా సృష్టించే సంచలనాలు మామూలుగా ఉండవని చెప్పవచ్చు. పుష్ప ది రూల్ సాధిస్తున్న రికార్డులు చూసి ఇండస్ట్రీ వర్గాలు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. రాబోయే రోజుల్లో సీక్వెల్స్ కు మరింత డిమాండ్ పెరిగే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
 
పుష్ప ది రూల్ కు తెలుగు రాష్ట్రాల కంటే ఇతర రాష్ట్రాల్లోనే అదిరిపోయే రెస్పాన్స్ వస్తుండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. రాజమౌళి సపోర్ట్ లేకుండానే పాన్ ఇండియా స్థాయిలో ఎదిగిన బన్నీని ఎంత మెచ్చుకున్నా తక్కువేనని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. బన్నీ రెమ్యునరేషన్ సైతం అంతకంతకూ పెరుగుతోందని సమాచారం అందుతోంది. రష్మిక, శ్రీలీలలకు సైతం ఈ సినిమా మంచి పేరును తెచ్చిపెట్టింది.  బన్నీ పుష్ప ది రూల్ సినిమా అంచనాలకు మించి సంచలనాలు సృష్టించాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.


 
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: